మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు గ‌ర్భాన్ని నిరోధించ‌డానికి మాత్ర‌ల‌ను ఆడ‌వాళ్లు వేసుకుంటారు. గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌లు ఆడ‌వాళ్లే కాదు త్వ‌ర‌లో మ‌గ‌వాళ్ల‌కు కూడా అందుబాటులోకి రానున్నాయి. అదేంటి మ‌గ‌వారికి గ‌ర్భ‌మే ఉండ‌దు క‌దా.. అలాంట‌పుడు వాళ్లు గ‌ర్భ‌నిరిధ‌క మాత్ర‌లు ఎలా వేసుకుంటారు అనే అనుమానం క‌లుగుతుంది.. అవాంచిత గ‌ర్భం రాకుండా, ప్లానింగ్ కోసం కొంద‌రు పిల్ల‌ల్ని క‌నాల‌నుకోరు వారి కోసం ప్రెగ్నెన్సీని నిరోదించ‌డానికి మ‌హిళ‌ల‌కు మాత్ర‌లు, లూప్ వంటివి ఉంటాయి. అదే మ‌గ‌వారికి కండోమ్స్ లాంటి సాధ‌నాలు ఉంటాయి. అయితే భ‌విష్య‌త్తులో గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌లు మ‌గ‌వారికి కూడా మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి.


మ‌గ‌వారి కోసం గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌ను అందుబాటులో తీసుకురావ‌డం కోసం గ‌త కొన్నేళ్లు ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ ప్ర‌యోగాల్లో స్కాట్‌లాండ్ కు చెందిన‌ యూనివ‌ర్సిటీ అఫ్ డుండీ అడుగు ముందుకేసింది. కేవలం శారీరక సుఖం కోసం కలయిక కోరుకునే జంటల కోసం ఈ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తేనున్నట్లు ఆ యూనివ‌ర్సిటీ ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. వీలైనంత తొంద‌ర‌గా ఈ మాత్ర‌ల‌ను మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇలా మగవారికి గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి రావటానికి ది గ్రేట్ పర్సన్ ప్రపంచ కుబేరుడు..మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సహాయ, స‌హ‌కారాలు అందిస్తున్నారు.


మగవారికి గర్భనిరోధక మాత్రలు తయారీకి ప్రయోగాలకు సహకారం అందిస్తోంది బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ . ఈ మగవాళ్ల సంతాన నిరోధక మాత్రల తయారీ కోసం బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి 1.7 మిలియన్ డాలర్ల సాయాన్ని బిల్‌గేట్స్ అందించారు. మగవారి గర్భనిరోధక మాత్రలు ఆడవాళ్లలో అండాల తయారీని గర్భనిరోధక మాత్రలు ఎలా అడ్డుకుంటాయో అదే విధంగా ఈ మాత్రలు మగవాళ్లపై పని చేస్తాయట. అంటే మగవాళ్లలోనూ వీర్యకణాల తయారీని ఈ మ‌గ‌వాళ్ల గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌లు నిలిపివేస్తాయన్నమాట. సురక్షిత శృంగారం కోసం లేదా ఆలస్యంగా పిల్లలు కనడం లేదా పూర్తి అయిష్టత కారణాలతో చాలా ఏళ్ల క్రితమే కండోమ్‌ల‌ను మార్కెట్ లోకి తెచ్చారు శాస్త్ర‌వేత్త‌లు.

అయితే కండోమ్‌ల వ‌ల్ల మెడికల్ సైన్స్ లో ఎలాంటి ముంద‌డుగు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు అనే కొత్త ప‌ద్ద‌తి ఇంత కాలానికి తెర మీదకు వ‌చ్చింది. 2015-19 మధ్య కాలంలో 121 మిలియన్ల మంది మహిళలు ఇష్టం లేకున్నా గర్భం దాల్చారని పలు సర్వేలు వెల్ల‌డించాయి. మ‌రీ ముఖ్యంగా పేద దేశాల్లో జనాభా పెరుగుదలకు ఈ సంతాన నిరోధక మాత్రలు అడ్డుకట్ట వేస్తాయని యూనివ‌ర్సిటీ ఆఫ్ డూండ్  ప్రొఫెసర్ క్రిస్ పేర్కొన్నాడు. అయితే ఈ మాత్రలు శృంగారానికి సంబంధించి సుఖ వ్యాధుల్ని అడ్డుకుంటాయా అని ప్రశ్న తమ పరిధిలోని లేదని వెల్ల‌డిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: