జ్వరం, దగ్గు, జలుబు ఇవన్నీ సాధారణంగా అందరికీ వచ్చి పోతుంటాయి. కానీ చిన్నారులకు మాత్రం ఇవి చాలా ఇబ్బంది కలిగిస్తాయి, కొన్నిసార్లు ప్రమాదాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా జ్వరం , కొంతమంది పిల్లలకు జ్వరం ఎక్కువైతే ఫిట్స్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అయితే మీ పిల్లలకు టెంపరేచర్ అమాంతం పెరిగిపోతూ ఉంటే ఏం చేయాలి.. ? హాస్పిటల్ కు తీసుకు వెళ్ళే దాకా వెయిట్ చేయాల్సిందేనా...? ఒకవేళ ఆసుపత్రి మీకు చాలా దూరంలో ఉంటే, కొన్ని కారణాల వలన వెళ్ళడానికి ఆలస్యం అయితే ఈలోపు ఎలా పిల్లల శరీర ఉష్ణోగ్రత అధికం కాకుండా రక్షించుకోవాలి అంటే...? అందుకు చిన్న పిల్లల వైద్య నిపుణులు ఇలా చెబుతున్నారు.

* ముందుగా మీ ఇంట్లో చిన్నారులు ఉంటే థర్మామీటర్ తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాలి. అదీ అందుబాటులో జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొన్ని సార్లు మీ పిల్లలకు జ్వరాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవచ్చు. అదే థర్మామీటర్ మీ వద్ద ఉంటే టెంపరేచర్ ఎంత ఉంది అన్నది కరెక్ట్ గా తెలుసుకోవచ్చు.

* ఒకవేళ శరీర ఉష్ణోగ్రత 101 లేదా అంతకు మించి ఉంటే వెంటనే ఫీవర్ సిరప్ ను డాక్టర్ల సూచన మేరకు తగిన మోతాదులో ఇవ్వాలి. అయితే జ్వరం ఎంత ఎక్కువగా ఉన్నా ఆరు గంటలకన్నా తక్కువ వ్యవధిలో మరోసారి సిరప్ ను ఇవ్వరాదు.

* మీ ఇంట్లో ఏసి కనుక ఉంటే ఆన్ చేసి చల్లటి వాతావరణం ఉండేలా చేయండి. దుప్పటి వంటి మందమైన దుస్తులు పిల్లలపై కప్పరాదు.
 
* ఇక తదుపరి వెంటనే  ఒక శుభ్రమైన బట్టను తీసుకుని  చల్లటి నీటిలో ముంచి నీటిని  పిండకుండా శరీరాన్ని, ముఖాన్ని తుడవాలి. ముఖ్యంగా భుజం కింది భాగంలో, ముఖం కింది భాగంలో, మెడ కింద బాగా తుడవాలి. అది కూడా ఎక్కువ సేపు కాదు అలా ఒకసారి తుడిచి వెంటనే ఆపేయాలి.

* నుదిటిపై తడి గుడ్డను జ్వరం తగ్గే వరకు ఉంచండి.  అరచేతుల్లో, అరికాలులో చెమ్మ తగలకుండా చూసుకోవాలి. మళ్ళీ శరీరంపై తడి ఆరిపోయాక  ఇలాగే తడి తడిగా తుడవాలి. ఇలా ఒక నాలుగైదు సార్లు చేయాలి.

* ఈ లోపు ఆ తరవాత ఒక పదిహేను, ఇరవై నిముషాలు తర్వాత మళ్ళీ ఒకసారి శరీర ఉష్ణోగ్రతను చెక్ చేయండి. అప్పటికి టెంపరేచర్ కంట్రోల్ లోకి రాకుండా అధికంగా ఉంటే వెంటనే హాస్పిటల్ కు వెళ్ళండి.

జ్వరం ఉన్నప్పుడు ఘన పదార్ధాలు కంటే ద్రవపదార్థాలు అధికంగా స్వీకరించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: