మన శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇలాంటి ఆహారాల్లో మాంసం ఒకటి. మటన్ ను కానీ, మటన్ లివర్ ను వారానికి రెండు నుండి మూడు సార్లు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా రక్తహీనత సమస్య అనేది ఈజీగా తగ్గుతుంది. ఎందుకంటే మాంసం లివర్ లో హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ కి అవసరమయ్యే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే ఈ ఐరన్ ని మన శరీరం త్వరగా గ్రహిస్తుంది. అలాగే మాంసాహారులు ఖచ్చితంగా చేపలను కూడా ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ఐరన్ తో శరీరానికి కావల్సిన ఇతర పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇంకా అలాగే పండ్లను తీసుకోవడం వల్ల కూడా మనం ఈ రక్తహీనత సమస్య నుండి ఈజీగా బయట పడవచ్చు. ఇక సిట్రస్ జాతికి చెందిన పండ్లల్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు ఈజీగా పెరుగుతాయి.


ఇంకా అలాగే ఆపిల్, దానిమ్మ, స్ట్రాబెరీ, నిమ్మ, నారింజ, పుచ్చకాయ వంటి పండ్లను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.ఇంకా అదే విధంగా ప్రతిరోజూ ఒక ఉడికించిన కోడిగుడ్డును తినడం వల్ల కూడా రక్తహీనత సమస్య ఈజీగా తగ్గుతుంది. అదే విధంగా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో డ్రై ఫ్రూట్స్ కూడా మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆప్రికాట్ పండును తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ ఆప్రికాట్ పండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను ఈజీగా తగ్గించడంలో సహాయపడుతుంది.ఇంకా అలాగే శరీరంలో రక్తాన్ని పెంచే ఆహారాల్లో అంజీర్ కూడా ఒకటి. ఈ పండులో ఐరన్ తో పాటు మన శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు కూడా చాలా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల  మనం రక్తహీనత సమస్యను ఈజీగా అధిగమించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: