నెయ్యి కాఫీ గురించి ఎప్పుడైన విన్నారా? ప్రస్తుతం ఈ కాఫీ చాలా బాగా ట్రెండ్ అవుతోంది.చాలా మంది సినీనటులు ఈ ఘీ కాఫీ తాగడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.అయితే చలికాలంలో ఘీ కాఫీని తీసుకోవడం చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఈ చలికాలంలో అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, మెరుగైన జీవనశైలిని పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎన్నో ఆరోగ్యకరమైన కొవ్వులు  ఉండే నెయ్యిని ఆహారంలో ఏదో ఒక సమయంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని వైద్యులు చెబుతున్నారు.అయితే రోజువారీ కెఫీన్ ను పరిమితమైన మోతాదులో తీసుకుంటే  ఘీ కాఫీ చాలా మేలు చేస్తుందని తెలుస్తుంది.ఈ కాఫీ తో మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని చాలా శాస్త్రీయ ఆధారాలు కూడా వచ్చాయి.సినీ యాక్టర్స్ రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి పలువురు సెలబ్రిటీలు ఘీ కాఫీని తమ డైట్ లో చేర్చుకున్నారు.


ఇక నెయ్యిలో ఉండే ఆరోగ్యకర కొవ్వులు ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ను కలుగచేయడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా మెరుగ్గా తగ్గించుకుంటు వస్తుంది. రోజులో ఎక్కువసేపు ఎంతో ఉత్సాహంగా ఉండేలా ఈ ఘీ కాఫీ మనకు సహాయపడుతుంది.అయితే కాఫీలో ఘీ కలపడం వల్ల కెఫీన్ ను గ్రహించడం నెమ్మదించేలా చేస్తుంది. ఇక ఫ్యాట్స్ తో కలిపి కెఫీన్ ను తీసుకుంటే దాని నుండి వచ్చే శక్తి నిదానంగా విడుదల అయ్యేందుకు దారి తీస్తుందని జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అధ్యయనం వాళ్లు వెల్లడించారు. ఇంకా అదే విధంగా కాఫీతో ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్ నుంచి కూడా ఘీ కాఫీ ఉపశమనం కలిగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. నెయ్యిని వాడటం వల్ల జీర్ణక్రియ మెరుగై కడుపుబ్బరం వంటి సమస్యలను నివారించవచ్చని జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనం కూడా స్పష్టం చేసింది.కాబట్టి ఖచ్చితంగా ఈ కాఫీ తాగండి. చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందండి. సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: