ఈ టమాటాలు తింటే భయంకర జబ్బులకి చెక్ పెట్టొచ్చు?


ప్రతి వంటింట్లో కూడా టమాట అనేది అతి ముఖ్యమైన కూరగాయ.అసలు టమోటాలు లేకుండా ఏ కూర కూడా పూర్తి కాదు. టొమాటో మన ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అందాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది.అయితే చాలా మంది కూడా ఎర్రటి టమాటాను వాడతారు. సాంబారు, పులుసు, చట్నీలకు ఉపయోగిస్తారు. అయితే పచ్చి టొమాటోలో కూడా చాలా రకాల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. పచ్చి టొమాటోల్లో క్యాల్షియం ఇంకా పొటాషియం ఎక్కువగా ఉంటాయి.ఇందులో విటమిన్లు A, C, ఫైటోకెమికల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.గ్రీన్ టొమాటోలో విటమిన్ కె, కాల్షియం ఇంకా లైకోపీన్ మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి. ఈ పచ్చి టొమాటోలను చిన్న పిల్లలకు  తినిపిస్తే వారు చాలా బలంగా ఎదుగుతారు.పచ్చి టమోటోలో బీటా కెరోటిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కళ్లను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. 


ఇంకా అలాగే ఐ ఫోకస్ మెరుగుపడుతుంది. ఇంకా అలాగే, వీటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి మంచి పోషణనిస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.పచ్చి టొమాటోల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వల్ల క్యాన్సర్ జబ్బు రాకుండా నిరోధిస్తుంది. అలాగే అధిక రక్తపోటుతో బాధపడేవారు పచ్చి టమోటాలు తింటే మెరుగైన రిలీఫ్ ఉంటుంది. ఇంకా అలాగే వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.పైగా ఇది సీజనల్ వ్యాధులను నివారిస్తుంది.ఇంకా పచ్చి టమాటలు తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ బాధితులు మంచి ఫలితాలని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీటిలో ఉండే లైకోపిన్, ఫైబర్.. వంటి పోషకాలు ఆక్సీకరణ ఒత్తిడిని ఈజీగా తగ్గించడంలో, కణజాల నష్టాన్ని నివారించడంలో, మంటను తగ్గించడంలో బాగా సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.వీటిని చిన్న పీసులుగా కట్ చేసుకుని సలాడ్ వంటి వాటిల్లో మిక్స్ చేసి తినవచ్చు. కూరల్లో, స్మూతీస్, సూప్స్, వంటి వాటిల్లో యాడ్ చేసుకొని  తింటే బాగుంటాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: