ల్లులు మరియు వాటి గుడ్లు 48 సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద చనిపోతాయి. కాబట్టి, మీ పరుపు కవర్లు, దిండు కవర్లు, దుప్పట్లు, కర్టెన్లు మరియు ఇతర బట్టలను ఎక్కువ ఉష్ణోగ్రత గల వేడి నీటిలో కనీసం 30 నిమిషాలు ఉతికి, ఆ తర్వాత ఎక్కువ వేడిలో డ్రై చేయాలి. డ్రై చేయలేని వాటిని ఎండలో ఉంచాలి.
నల్లులు సాధారణంగా పరుపుల అంచులు, మంచం ఫ్రేమ్‌లోని పగుళ్లు, కిటికీ అంచులు, గోడ పగుళ్లు మరియు ఫర్నిచర్ సందుల్లో దాక్కుంటాయి. శక్తివంతమైన వాక్యూమ్ క్లీనర్ సహాయంతో ఈ ప్రాంతాలన్నింటినీ పూర్తిగా శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన వెంటనే, వాక్యూమ్ బ్యాగ్‌ను తీసి గట్టి ప్లాస్టిక్ కవర్‌లో మూటగట్టి ఇంటి బయట పడేయాలి, లేదంటే అవి మళ్లీ ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది.
మీ పరుపు, బాక్స్ స్ప్రింగ్‌లపై నల్లులు లోపలికి వెళ్లకుండా లేదా బయటికి రాకుండా నిరోధించే జిప్పర్ (Zipper) ఉన్న ప్రత్యేక కవర్లు (Encasements) వాడాలి. నల్లులు ఈ కవర్‌ల లోపల ఉంటే, అవి దాదాపు ఒక సంవత్సరం పాటు ఆహారం లేకుండా జీవించగలవు. ఈ కవర్లు కనీసం ఒక సంవత్సరం పాటు అలాగే ఉంచాలి, అప్పుడే లోపలి నల్లులు పూర్తిగా చనిపోతాయి. నల్లులు బట్టలు, పుస్తకాలు, బొమ్మలు లేదా ఇతర వస్తువుల ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించగలవు. తరచుగా ప్రయాణాలు చేసేటప్పుడు, బస చేసే హోటల్ గదిని మరియు మీ లగేజీని పూర్తిగా పరిశీలించుకోవాలి. అనవసరమైన వస్తువులను, చిందరవందరగా ఉన్న వాటిని తొలగించి, గదిని శుభ్రంగా మరియు వ్యవస్థీకృతంగా ఉంచుకోవాలి.
గోడలు, ఫర్నిచర్ లేదా చెక్క పలకల్లోని చిన్న పగుళ్లను మరియు రంధ్రాలను వెంటనే సీలెంట్ (Sealant) లేదా పుట్టీ ఉపయోగించి పూడ్చివేయాలి. నల్లులు దాక్కోవడానికి మరియు గుడ్లు పెట్టడానికి ఇటువంటి ప్రాంతాలను ఆశ్రయిస్తాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి