గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో డిసెంబ‌ర్ 4వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘ‌ట‌న‌లు..

1829: సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు. భర్త చనిపోయిన స్త్రీలు, భర్త యొక్క చితి మంటలలో తమంతట తామే దూరి సజీవంగా తెగలబెట్టుకొనే ఆచారము.
1936: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది.అభ్యుదయ రచయితల సంఘం (టూకీగా అరసం) సామాజిక అభ్యుదయాన్ని కోరే రచయితల సంఘం. జాతీయ స్థాయిలో 1936వ సంవత్సరంలో అఖిల భారత అరసం ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1943వ సంవత్సరంలో తెనాలి పట్టణంలో ఏర్పడింది. ఆనాటి ప్రథమ సమావేశానికి ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు గారు అధ్యక్షత వహించారు.ఈ సంఘపు స్వర్ణోత్సవాలు కూడా తెనాలిలోనే 1994 ఫిబ్రవరి 12, 13 తేదీలలో నిర్వహించారు

ప్ర‌ముఖుల జననాలు


1877: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (మ.1958)
1898: కె శ్రీనివాస కృష్ణన్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (మ.1961) కె శ్రీనివాస కృష్ణన్ 1898 డిసెంబరు 4 న తమిళనాడు, భారతదేశంలో జన్మించారు. అతని తండ్రి తమిళ్, సంస్కృతం పాండిత్యంలో ఒక జన విజ్ఞాన పండితుడు.
1910: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009)
1919: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (మ.2012)13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త.
అవిభాజిత పంజాబ్ లోని జీలం (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నది) లో ఒక గౌరవనీయమైన పంజాబీ ఖత్రీ (వర్తక కులం) కుటుంబములో పుట్టిన గుజ్రాల్ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొని, 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్ళాడు.
1922: ఘంటసాల వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (మ.1974)
1929: గడ్డం రాంరెడ్డి, దూరవిద్య ప్రముఖులు, సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు" (మ. 1995)
1945: ఇంద్రగంటి జానకీబాల, నవలా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు, ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి.
1962: ఆర్.గణేష్, ఎనిమిది భాషలలో శతావధానం చేశాడు.
1977: అజిత్ అగార్కర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1981: రేణూ దేశాయ్, తెలుగు నటి, రూపదర్శి, కాస్ట్యూం డిజైనర్.
1982 : ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రేరణ కలిగించే వక్త, క్రైస్తవ మత ప్రచారకుడు నిక్ వుజిసిక్


పండుగలు , జాతీయ దినాలు

భారతదేశ నౌకాదళ దినోత్సవం

మరింత సమాచారం తెలుసుకోండి: