గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మార్చి 25వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు..

1655 : శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం అయిన టైటాన్ ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నాడు.
1992 : మిర్ అంతరిక్ష కేంద్రములో 10 నెలలు గడిపిన ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ భూమి పైకి చేరారు.
2008: పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.

ప్ర‌ముఖుల జననాలు

1914: నార్మన్ బోర్లాగ్, అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త.
1927: పి.షణ్ముగం, పాండిచ్చేరి రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి . (మ.2013)
1933: వసంత్ గోవారికర్, భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (మ.2015.) ఆయన ఇస్రో కు ఛీఫ్ గా తన సేవలందించారు. భారతదేశంలో సైన్స్, టెక్నాలజీ శాఖ కార్యదర్శిగా,1991–1993 మధ్యకాలంలో అప్పటి భారత ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు కు శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు.ఆయన అంతరిక్ష రంగంలో విశేష పరిశోధనలు చేసారు. ఆయన వాతావరణం, జనాభా రంగాలలో కూడా తన సేవలనందించారు. 'భారత మాన్సూన్ నమూనా’ పితామహుడిగా పేరుగాంచిన ఆయన తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో వాతావరణ మార్పులను సూచించే వ్యవస్థను రూపొందించిన తొలి శాస్త్రవేత్త.
1957: శ్రీరామోజు హరగోపాల్, చరిత్ర పరిశోధకులు, కవి, వ్యాసకర్త.
1985: ప్రణయ్‌రాజ్ వంగరి, నాటకరంగ పరిశోధకుడు, తెలుగు వికీపీడియా నిర్వాహకుడు.

ప్ర‌ముఖుల  మరణాలు

1931: ప్రతాప్ అనే పత్రిక సంపాదకుడు గణేష్ సంకర్ విద్యార్థి ని, కాన్పూర్ లో మతవాద శక్తులు హత్య చేసాయి.
1983: మానికొండ చలపతిరావు, పత్రికా రచయిత, సంపాదకుడు, గ్రంథకర్త, సాహితీవేత్త, మానవతా వాది.వీరు 1908 సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించారు. ఎం.ఏ., బి.ఎల్. పట్టాలను పొంది కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. వీరు విశాఖపట్నంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన "ఎథేనియం" అనే పేరుతో సాహిత్య సాంస్కృతిక సంస్థను నెలకొల్పి తాను కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత "పీపుల్స్ వాయిస్", "వీక్ ఎండ్", "హిందూస్థాన్ టైమ్స్" పత్రికలలో వేర్వేరు కాలాలలో సహాయ సంపాదకులుగా పనిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: