పూర్వకాలంలో వేపపుల్లతో మన పూర్వీకులు తమ పళ్ళను శుభ్రం చేసుకునేవారు. అయితే ఆపద్ధతి పోయి దిగువ తరగతి వర్గాల నుండి అత్యంత ధనవంతుల వరకు టూత్ బ్రేష్ మరియు పేస్ట్ లేకుండా గడవని పరిస్థితి. దీనికితోడు ఈమధ్య జనానికి తమ దంతాల పై శ్రద్ధ బాగా పెరిగి పోవడంతో రోజుకు రెండు సార్లు కూడ బ్రేష్ చేసుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. 
Toothbrush & Toothpaste
ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య అమెరికాలోని వాషింగ్టన్ పట్టణంలో కొందరు వైద్య విద్యార్దులు చేసిన పరిశోధనలో టూత్ పేస్ట్ మరియు సబ్భులతో పేగు క్యాన్సర్ వస్తుంది అన్న విషయాన్ని లేటెస్ట్ గా వెలుగులోకి తీసుకు వచ్చారు. అమెరికా విద్యార్ధులు చేసిన పరిశోధన ప్రకారం టూత్‌ పేస్టులో ట్రైక్లోసన్‌ అనే బ్యాక్టీరియాను చంపే పదార్థం ఉంటుందట. 
Toothbrush with toothpaste on blurred background
అది కొద్దిగా ఈటూత్ పేస్ట్ కడుపులోకి వెళ్లినా పేగుల్లో ఉండే ఆరోగ్యకర అవసరమైన బ్యాక్టీరియాను చంపేయడం వల్ల పేగు కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఆమ్‌హెర్స్ట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే టూత్ పేస్ట్ ఉత్పత్తి దారులు ఆ రసాయనాన్ని వాడకుండా ఉండలేని నేపధ్యంలో ఎంత ప్రముఖ కంపెనీ టూత్ పేస్ట్ వాడినా అది ప్రమాదమే అని అంటున్నాయి అమెరికా ప్రరిశోధనలు. ఎలుకలకు టూత్ పేస్ట్ లో ఉండే ట్రైక్లోసన్‌ తినిపించి పరిశోధనలు చేయగా వాటి జీర్ణ వ్యవస్థకు అవసరమయ్యే బ్యాక్టీరియా చనిపోయినట్లు తేలింది అని అంటున్నారు. అయితే అమెరికాలో ఉత్పత్తి అయ్యే టూత్ పేస్ట్ లో ఇలాంటి ట్రైక్లోసన్‌ వాడే విషయమై నిషేధం ఉన్నా మనలాంటి దేశాలలో ఇలాంటి నిషేధాలు ఎక్కడా లేవు. 

అదేవిధంగా ఈ పదార్ధాన్ని సబ్బులు తయారీలో కూడ వాడుతున్న నేపధ్యంతో పాటు పిల్లలలు ఆడుకునే బొమ్మలలో కూడ ఈ రసాయనం ఉంది అని అధ్యయనాలు చెపుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2వేల ఉత్పత్తుల్లో ట్రైక్లోసన్‌ వాడుతున్నారు. ఈ రసాయనం హర్మోన్‌ వ్యవస్థను దెబ్బతీస్తుందని కూడ హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు మనం త్రాగే నీళ్ళు పీల్చే గాలి తినే తిండి కలుషితం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ లిస్టులోకి టూత్ పేస్ట్ కూడ వచ్చి చేరడంతో ఇక అంతా టూత్ పేస్ట్ ను కూడ చూసి భయపడవలసిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: