ప్రజలు వర్షాకాలం అంటే ఎక్కువగా జబ్బులతో బాధపడాల్సి వస్తుంది. ఈ కాలం ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా కలుషితం గానే ఉంటుంది. ఎక్కువగా ఈ కాలంలో దోమలు విపరీతంగా పెరిగి పోతూ ఉంటాయి. అందుకే ఈ కాలం అందరూ జాగ్రత్త గా వుండాలి. ఇకపోతే ఈ వర్షాఋతువులో ప్రతి ఒక్కరు తినకూడని పదార్థాలు ఏంటివో తెలుసుకుందాం.

వర్షాకాలం అంటేనే ఎక్కువగా మనం రోడ్డు పక్కన వేసేటువంటి బజ్జీలను, ఇతర ఫాస్ట్ ఫుడ్ లను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ వాటిని తినడం చాలా ప్రమాదకరమని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుచేతనంటే ఈ ఆహారం వర్షం పడడం వల్ల చుట్టూ ఉన్న దోమలు, ఈగలు వాటిమీద వాడడం వల్ల చాలా ప్రమాదం. రోగాల బారిన పడవలసి వస్తుందట.

ఈ కాలంలో ఎక్కువగా ఆకుకూరలు బాగా చిగురిస్తూ ఉంటాయి. ఈ ఆకు కూరలు తేమ వలన బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి ఆకులపై ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. అందుచేతనే సీజన్లో ఆకుకూరలను బాగా కడుక్కొని తినాలి.

ఆయిల్ ఫుడ్ లను ఎక్కువగా తినడం వల్ల  విరోచనాలు, జీర్ణం కాని సమస్య వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము.. ముఖ్యంగా సమోసాలు, వేడివేడి చిప్స్ తినకూడదు.

ఇక ఈ సీజన్ లో  చేపలు, రొయ్యలు ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి సముద్రాలలో. అందుచేతనే ఈ కాలంలో ఎక్కువగా వీటిని తినకూడదు.

ఈ కాలంలో అప్పుడే పూసిన పండ్లు, ఆకుకూరలు, చిరుధాన్యాలను తినడం మంచిది. వీటిని వేడి నీళ్లలో కడిగి బాగా ఉడికించి తినడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు.ముఖ్యంగా ఈ కాలం తీపి పదార్థాలకు కూడా కొంచెం దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంతవరకు అరిటాకులో భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి.

ఇక ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పైన సూచించిన విధంగా ఏది మంచిదో ఏది చెడుదో తెలుసుకొని పాటిస్తే, మంచిదని నిపుణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: