ముఖ్యంగా ఎవరైనా పేదవారు అమరావతిలో ప్రభుత్వం ఇచ్చే ఇల్లును తీసుకుంటే వాటిని కాల్చేస్తాం. వారిని చంపేస్తామంటూ కొంతమంది సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారంటే ఆయన రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి రాజకీయ అవసరాల కోసం విమర్శలు చేస్తున్నారని అనుకోవచ్చు.
కానీ బయట నుంచి బెదిరింపులు చేస్తున్న వ్యక్తులను కచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఇలాంటి వారిని శిక్షించకుండా విడిచిపెడితే మరిన్ని బెదిరింపులకు దిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అధికారికంగా ఇస్తున్నటువంటి ఇళ్లపై రాద్ధాంతం చేయడం వారిని అక్కడ ఉండనీయకుండా చేసేందుకు చేస్తున్న కుట్ర గా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రెండుసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు శవాలు పాతే ఇళ్లను ఇస్తున్నారని ప్రభుత్వం పై విమర్శలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం అని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆయన ఇచ్చిన ఇళ్లను ఒకసారి పరిశీలించుకోవాలని వైసీపీ నాయకులు సూచిస్తున్నారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏమి సాధించలేరని చెప్పారు. ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మ విమర్శ చేసుకోవాలని వైసీపీ పార్టీ లీడర్లు చెబుతున్నారు. ఇల్లు తీసుకునే వారిని చంపేస్తాం అని అన్న వారిని మాత్రం అస్సలు ఉపేక్షించకూడదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి