
ఆ తర్వాత ఇద్దరు పిల్లలు వద్దు అని ఆ తర్వాత చెప్పుకొచ్చింది భారత్. ఈ రకంగా జనాభాని అదుపులో పెట్టగలిగింది భారత్. అంతేకాకుండా ఇద్దరు పిల్లలు కన్నా ఎక్కువ కంటే స్థానిక సంస్థల్లో పదవులు ఉండవని కూడా చెప్పడంతో పల్లె ప్రాంతాల్లో మార్పు వచ్చింది. ముఖ్యంగా అసలు మార్పు రావాల్సింది అక్కడే. భారతదేశం జనాభాని నియంత్రించడానికి స్టేట్మెంట్లు ఇచ్చింది గాని వ్యక్తిగత జీవితంలోకి చొరబడలేదు.
కానీ చైనా మాత్రం ఆ తప్పు చేస్తుంది. అందుకే అక్కడ జనాభా సంఖ్య మైనస్ లో పడిపోతుంది. చైనాలో ఒక్కరిని మాత్రమే కనమని, జనాభా సంఖ్య పెరిగిపోతుండడంతో ఒక టైంలో ఒక్కరినే కనమని ప్రభుత్వం కఠినంగా చర్యలు చేసుకుంటూ వచ్చింది. దానితో చాలామంది వరకు ఒకరినే కన్నారు. అప్పట్లో ఆడ పిల్లలు వద్దనుకున్న వేళ భ్రూణ హత్యలు బాగా పెరిగిపోయాయి. కేవలం మగ పిల్లలే కావాలని మగ పిల్లల్ని కన్నారు. దాంతో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయి మగ పిల్లల సంఖ్య పెరిగిపోయింది.
ఆడ మగ పుట్టుకల్లో వ్యత్యాసం రావడంతో అక్కడ పెళ్లి చేసుకోవడానికి మగ పిల్లలకి ఆడపిల్లలు కరువు అయ్యారు. దాంతో ప్రభుత్వం వ్యక్తిగత విషయాలకు వెళ్లడం మొదలు పెట్టింది. పెళ్లి కాకపోయినా పిల్లల్ని కనమని, ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్తుంది. ఏడాదికి 45 రోజులు ప్రేమించుకోమని సెలవులు ఇస్తుంది. పుట్టిన పిల్లలకు వారి అన్ని ఖర్చులు భరిస్తానంటుంది చైనా.