
పైనాపిల్..
పైనాపిల్ తినడంతో శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ పండుకు దూరంగా ఉండాలి.దానికి కారణం ఈ పండులో అధికంగా ఉండే స్టిమ్యులేంట్ బ్రోమెలైన్ గర్భస్రావం మరియు నెలలు నిండకుండానే ప్రసవం అయ్యేందుకు దోహద పడుతుంది.ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి మూడు మాసాలు ఈ పండును అస్సలు తినకపోవడమే చాలా ఉత్తమం.అంతేకాక దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా మరియు డీహైడ్రేషన్‌కు గురవుతారు కూడా.
చింతకాయ..
గర్భం దాల్చిన సమయంలో స్త్రీలు ఎక్కువగా పులుపు తినడానికి ఇష్టపడతారు.ఇక పులుపు అనగానే ముందుగా గుర్తొచ్చేది చింతపండు మరియు చింతకాయలు.కానీ ఆ చింతపండు అప్పటికప్పుడు నోటికి రుచిని అందించినా,ఇందులో ఉండే విటమిన్ సి ప్రొజెస్టెరాన్ ఉత్పత్తికి నిరోధం కలిగిస్తుంది.దానితో గర్భిణీ స్త్రీలలో ప్రొజెస్టిరాన్ కొరత ఏర్పడి గర్భస్రావానికి దారితీసె అవకాశం ఉంటుంది.కావున గర్భిణీ స్త్రీలు చింతపండుకు దూరంగా ఉండటం మంచిది.
పుచ్చకాయ..
నీటిశాతం అధికంగా వున్న పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.ఇది మన శరీరం డిహైడ్రెషన్ కాకుండా కాపాడి,శరీరంలోని అన్ని విష పదార్థాలను తొలగిస్తుంది.కానీ గర్భం దాల్చిన సమయంలో పుచ్చకాయ తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలిగే అవకాశం వుంది.మరియు పుచ్చకాయను ఎక్కువగా తినడంతో గర్భిణీ స్త్రీలలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి,ఈ సమయంలోనే మధుమేహానికి గురవుతారు.
ఖర్జూరం..
ఖర్జూరంతో శరీరానికి అధిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గర్భిణీ స్త్రీలు ఈ పండుకు దూరంగా ఉండటం ఉత్తమం . దీనిని అధికంగా తీసుకుంటే శరీరం వేడిగా మారుతుంది. దానితో గర్భాశయ సంకోచాలకు గురవుతుంది.
ద్రాక్ష..
ద్రాక్షను అధికంగా తీసుకోవడంతో,ఇందులో ఉండే రెస్వెరాట్రాల్గర్భాన్ని విషపూరితం చేస్తుంది.అలాగే, ద్రాక్షలో ఆమ్ల స్వభావం అధికంగా ఉంటుంది.దీనితో ఆసిడిటి సమస్యను పెంచుతుంది.