రాబోయే రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. పురుషులకే అవకాశాలు.. ఈ నియోజకవర్గం నాదే పక్కా అనుకుంటే చాలా మంది జీవితాలు మారిపోతాయి.  వాళ్లు ప్రయత్నం చేస్తే వాళ్ల భార్యనో, కుమార్తెనో లేక బంధువునో ఎన్నికల్లో నిలబెట్టి తెర వెనుకు వీరు రాజకీయం చేయాలి. ఇక ఇంట్లో పనిచేసే బాధ్యతను పక్కన బెట్టి రాజకీయాలు చూసుకోవాలి.


ఇప్పటికే మగాళ్ల జీవితాలు దాదాపుగా మారిపోయాయి. ఎన్నారైలు సాధారణంగా అక్కడ ఏంటి అంటే పని మనిషికి బాగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి పని మనిషులను సామాన్యంగా పెట్టుకోరు. ఇక్కడ బాగా పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. వివాహమయ్యాక ఇంటి పనిని ఇద్దరూ పంచుకుంటుంటారు. ఎందుకంటే ఇద్దరూ ఉద్యోగాలు చేయాలి కాబట్టి. ఒకరు అన్నం వండితే మరొకరు కూరగాయాలు తరగడం లాంటివి.  


ఇదే సంస్కృతి భారతదేశంలో కూడా వచ్చింది. దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో పని చేస్తున్న మగ వారు వాళ్ల ఇంట్లో వంట పనుల్లోను, శుభ్రం చేసే పనుల్లోను సహాయకులుగా ఉంటున్నారు. పిల్లల్ని పెంచే క్రమంలో కూడా వారు తోడు నిలబడుతున్నారు.  ఇది వందకి ఓ పది  నుంచి ఇరవై శాతం పెరిగింది. గతంలో ఇది మగాళ్ల బాధ్యత కాదు అని ఒకశాతం మంది కూడా ఇలాంటి పనులు చేసేవారు కాదు.


గతంలో మంచినీళ్ల కోసం మహిళలు బిందెలు పట్టుకొని లైన్లలో నిల్చొనేవారు. ఇప్పుడు మధ్య తరగతి మగవాళ్లు పట్టణాల్లో క్యాన్లు పట్టుకొని మంచి నీరు తెస్తున్నారు.  రోజురోజుకు మన బతుకుల్లో మార్పులు వస్తున్నాయి.  ఇప్పుడు రాజకీయాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. విదేశాల్లో లాగా మగవాళ్లు పనిని పంచుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. నాకు సంబంధం లేదు అంటే కుదరదు. ప్రతి పని చేసే తీరాల్సిందే అనే భారీ మార్పులకు సిద్ధం కావాల్సిందే మానసికంగా.


మరింత సమాచారం తెలుసుకోండి: