
అలాగే వాళ్ళకి ప్రశాంతత కూడా దొరుకుతుంది అంటున్నారు పండితులు. మరీ ముఖ్యంగా శుక్రవారం మహాలక్ష్మికి ప్రీతి కరమైన రోజుగా భావిస్తూ ఉంటాము. శుక్రవారం పూట మహాలక్ష్మిని పూజిస్తే ఇంటికి ఆ మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తుంది అని .. మన ఇంట్లోనే తిష్ట వేసి కూర్చుంటుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు . ఆ కారణంగానే ఉదయం శుక్రవారం పూట బాగా స్పెషల్ గా పూజలు కూడా చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఇంటి మహిళలు ఇంటి ఇల్లాలు శుక్రవారం పూట ఎంత చక్కగా రెడీ అయ్యి పూజలు చేస్తుందో మనం చూస్తూనే ఉంటాం.
అయితే పూజలు చేసేటప్పుడు కొన్ని కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఇంట్లో డబ్బులు ఎప్పుడు ఉంటాయి అంటున్నారు పండితులు . మరీ ముఖ్యంగా శుక్రవారం పూట మన ఇంట్లోని లక్ష్మీదేవిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపనే పంపకూడదు . అది కూడా మనం బీరువాలో దాచుకున్న డబ్బులు బయటకు తీయకపోవడం చాలా చాలా మంచిది అంటున్నారు . శుక్రవారం పూట మన ఇంటి లక్ష్మీదేవిని వేరే వాళ్ళకి అప్పుగా ఇచ్చిన వేరే వాళ్ళకి ఇచ్చిన లక్ష్మీదేవి మన చేతుల్లో నిలవదు అని ఇంట్లోని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు .
అదేవిధంగా కొంతమంది పండితులు కూడా సూచిస్తూ ఉంటారు . అంతేకాదు శుక్రవారం పూట ఉప్పు - మిరపకాయ - కారప్పొడి ఇరుగుపొరుగువారు అడిగిన అసలు ఇవ్వకూడదట . అలా ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట . శుక్రవారం ఉప్పు పక్కింటి వాళ్లకి ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని ఎప్పటినుంచో జనాలు నమ్ముతూ వస్తున్నారు . మరీ ముఖ్యంగా శుక్రవారం పూట చిరిగిన వస్త్రాలు వేసుకుంటూ ఉండడం ఏడుస్తూ ఒక మూల కూర్చోవడం లాంటివి అస్సలు చేయకూడదట . అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి కూడా ఇష్టపడదట . చక్కగా అలంకరించుకొని నవ్వుతూ ఎప్పుడు హ్యాపీగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుందట . ఈ విషయాలను స్వయంగా పండితులే చెప్పుకొచ్చారు. కనుక ఎవరైతే డబ్బుకి ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్లు శుక్రవారం పూట కొన్ని కొన్ని నియమాలు ఫాలో అవుతూ ఈ విధంగా పూజలు చేసుకుంటే కొంతవరకు వాళ్లకి డబ్బు కొరత అనేది తీరుతుంది అంటున్నారు పండితులు .
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. కొందరు పండితులు చెప్పిన విధంగానే సమాచారం ఇవ్వబడింది . ఇది ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం అని పాఠకులకు గుర్తుంచుకోవాలి..!!