శాకాహారం అనేది కేవలం ఒక ఆహార పద్ధతి కాదు, అదొక జీవనశైలి. మాంసం, చేపలు వంటివి తీసుకోని వారు పూర్తి ఆరోగ్యంతో ఉండాలంటే, శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు లభించేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, మాంసాహారం ద్వారా లభించే కొన్ని ముఖ్యమైన పోషకాల లోటు రాకుండా, శాఖాహారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ క్రింది ఆహారాలను వారి రోజువారీ మెనూలో కచ్చితంగా చేర్చుకోవాలి.
మాంసకృత్తులు కండరాల నిర్మాణానికి, రోగ నిరోధక శక్తికి అత్యవసరం. కందిపప్పు, పెసరపప్పు, శనగలు, రాజ్మా, చోళీ వంటి పప్పులు ప్రొటీన్‌కు అద్భుతమైన వనరులు. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. సోయాబీన్, టోఫు, సోయా పాలు వంటివి మాంసానికి సమానమైన ప్రొటీన్‌ను అందిస్తాయి. పాలు, పెరుగు, పనీర్, జున్ను వంటివి కూడా నాణ్యమైన ప్రొటీన్‌ను అందిస్తాయి.
బాదం, వాల్‌నట్స్, వేరుశనగలు, గుమ్మడి విత్తనాలు (Pumpkin seeds), అవిసె గింజలు (Flax seeds), చియా విత్తనాలు మంచి ప్రొటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులను ఇస్తాయి. శరీరంలో రక్త హీనత (Anemia) రాకుండా ఐరన్ చాలా అవసరం. పాలకూర, తోటకూర, గోంగూర వంటి ముదురు రంగు ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష ఐరన్‌తో పాటు తక్షణ శక్తిని ఇస్తాయి.చక్కెర బదులు బెల్లం వాడటం ఐరన్ స్థాయిలను పెంచుతుంది.
ఐరన్ ఉన్న ఆహారంతో పాటు నిమ్మకాయ, ఉసిరి వంటి విటమిన్-C ఉన్న ఆహారాలు తీసుకోవాలి. పాలు, పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులు కాల్షియం ప్రధాన వనరులు. బ్రోకలీ, ఆకుకూరలు. నువ్వులు (Sesame seeds), రాగులు (Finger millet/Ragi) వంటి చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శాఖాహారులు ప్రతిరోజూ కొంత సమయం పాటు ఎండలో ఉంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శాఖాహారులు విటమిన్ బీ12 పుష్కలంగా ఉన్న ఆహారాలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి