కష్టపడే మనస్తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చని టీడీపీ సీనియర్ నేత, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పని చూస్తే అర్ధమవుతుంది. ఈరోజుల్లో అధికారం లేకపోతే నేతలు అసలు ఉండలేరు. వెంటనే అధికారం ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారు. అయితే చినరాజప్ప రాజకీయ జీవితం తెలుగుదేశంతో మొదలుపెట్టి, ఇప్పుడు అదే పార్టీలో ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్నారు. కింది స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చిన చినరాజప్ప, తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా పని చేసారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో చినరాజప్ప బాగా కృషి చేసారు.

 

చినరాజప్ప కష్టాన్ని గుర్తించిన బాబు, ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత బొడ్డు భాస్కర రామారావుని కాదని 2014 ఎన్నికల్లో పెద్దాపురం అసెంబ్లీ టికెట్ ని చినరాజప్పకు ఇచ్చారు. ఇక రాజప్ప చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడుతూ, 10 వేల మెజారిటీతో గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాజప్పకు, చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. హోమ్ శాఖ బాధ్యతలతో పాటు డిప్యూటీ సీఎం పదవి కూడా కట్టబెట్టారు.

 

అయితే మంత్రి పదవి సమర్ధవంతంగా నిర్వహించడంలో చినరాజప్ప కాస్త వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ముందు వరుసలో ఉన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ గాలి వీచిన చినరాజప్ప మళ్ళీ పెద్దాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న చినరాజప్ప పనితీరులో మార్పు లేదు. ఎప్పుడు నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు.

 

మరో టీడీపీ నేత బొడ్డు భాస్కరరామారావు పెద్దగా సహకరించకపోయినా, తనదైన శైలిలో పని చేసుకుని వెళుతున్నారు. ఇక ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావం నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన సొంత పనులుగానీ, నియోజకవర్గంలో పనులుగానీ చేయించుకోవడంలో రాజప్ప తెలివిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. తన సొంత వ్యాపారాల కోసం వైసీపీ నేతలతో కూడా టచ్ లో ఉన్నట్లు తెలిసింది. వారితో టచ్ లో ఉంటూ కావాల్సిన పనులు చేయించుకుంటున్నారని టాక్.

 

ఇక ఇక్కడ చినరాజప్పకు వైసీపీ నేతలు పెద్దగా పోటీ ఇవ్వలేకపోతున్నారు. ఎన్నికల్లో తోట నరసింహం భార్య తోట వాణి బరిలో దిగిన రాజప్పని ఓడించలేకపోయారు. ఇక తర్వాత తోట వాణి సైలెంట్ అయిపోవడంతో, మళ్ళీ దవులూరి దొరబాబుని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా పెట్టిన కూడా, రాజప్పకి పెద్దగా పోటీ ఇవ్వలేకపోతున్నారని తెలుస్తోంది. అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉన్న రెండు మండలాలు సామర్లకోట, పెద్దాపురంలలో టీడీపీ బలంగానే ఉంది. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా, ఇక్కడ మాత్రం వైసీపీకి టీడీపీ గట్టి పోటీనిస్తుంది. అలాగే సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీల్లో కూడా టీడీపీ బలంగానే ఉంది.

 

అటు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాటం చేయడంలో రాజప్ప ముందే ఉన్నారు. ఎప్పుడు అధినేత చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటారు. ఇంకా ఏదైనా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో గానీ, అధికార పార్టీ నేతల విమర్శలకు చెక్ పెట్టడంలో కూడా చినరాజప్ప ముందుంటున్నారు.  మొత్తం మీద చూసుకుంటే  చినరాజప్ప పనితీరు బాగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: