నాగం జనార్ధన్ రెడ్డి...రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకుడు. ఎన్టీఆర్ హాయాం నుంచి రాజకీయాలు పనిచేస్తున్న నేత. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన నాగం...1985లో నాగర్‌కర్నూలు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి గెలిచి సత్తా చాటారు. అలాగే ఎన్టీఆర్, చంద్రబాబు సమయంలో కీలక పదవులు చేపట్టారు.

ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో నాగం అనూహ్యంగా టీడీపీకి దూరం జరిగారు. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. 2013లో బీజేపీలో చేరిన ఆయన...2014లో పోటీకి దూరమయ్యారు. ఇక అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్ధి మర్రి జనార్ధన్ రెడ్డి తొలిసారి విజయాన్ని అందుకున్నారు. అయితే 2012లో మర్రి...టీడీపీ నుంచి పోటీ చేసి నాగంపై ఓడిపోయారు.

అయితే 2018లో మర్రి, నాగంని ఓడించారు. నాగం కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఇలా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి జనార్ధన్ రెడ్డి..ఎమ్మెల్యేగా గొప్ప పనితీరు ఏమి కనబరుస్తున్నట్లు లేరు. ఏదో మొదటి సారి అంటే కాస్త ప్రజల్లో తిరిగారు గానీ..రెండోసారి గెలిచాక కాస్త ప్రజల్లో తిరగడం తగ్గించారు. అలాగే అభివృద్ధి కూడా పెద్దగా చేసింది లేదు. ప్రజా సమస్యల కంటే తన సొంత వ్యాపార లావాదేవీలని చూసుకోవడంపైనే ఎమ్మెల్యే శ్రద్ధ పెడుతున్నారని తెలుస్తోంది.


అలాగే ఎమ్మెల్యే బంధువుల చేతుల్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తోందని టాక్. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులని తప్పించుకునేందుకే ఇక్కడ ట్రస్టులని నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక నాగర్‌కర్నూలు బస్టాండ్ పరిస్తితి మరీ దారుణంగా ఉంది. ప్రయాణికులకు కనీస వసతులు ఉండవు. రాజకీయంగా చూసుకుంటే ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ నేత నాగంకు సానుభూతి ఉంది..నెక్స్ట్ ఎన్నికల్లో మర్రికి నాగం చెక్ పెట్టేలా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: