సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హర్రర్ సినిమాలు అంటే భారీ శరీరాలతో ముఖానికి భయంకరంగా మేకప్ వేసుకొని రెండు కోరలు పెట్టుకొ భయపెట్టే వారు..తర్వాత తెల్ల చీర కట్టుకట్టుకొని ముఖం తెల్లగా కనిపించేలా మెకప్ తో కళ్లు ఎర్రగా కనిపిస్తూ దెయ్యాన్ని చూపించారు... ఇక గ్రాఫిక్స్ మొదలైన తర్వాత చిత్రవిచిత్రాల్లో దెయ్యాలను చూపిస్తున్నారు. ఏది ఏమైనా గతంలో తెలుగులో విఠలాచార్య సినిమాలో హర్రర్ తో పాటు కామెడీ పండించే వారు తర్వాత రాంగోపాల్ వర్మ వచ్చిన తర్వాత కెమెరా ట్రిక్స్ ఎక్కువ ఉపయోగించి దెయ్యాన్ని చూపిస్తూ భయపెట్టించేవారు.

ఇక లారెన్స్ దర్శకులుగా మారి తర్వాత ‘ముని’ హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు.. అంతే ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఇదే కాన్సెప్ట్ పై ‘కాంచన’, గంగ లాంటి సినిమాలు తీసి తిరుగులేని దర్శకులుగా పేరు పొందారు.. కోట్లు గడించాడు. ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హర్రర్, కామెడీ కాన్సెప్టు తో నే సినిమాలు ఎక్కవ వస్తున్నాయి..రావడమే కాదు మంచి హిట్ కూడా అవుతున్నాయి. తెలుగులో ‘గీతాంజలి’ ఈ మద్య వచ్చిన ‘రాజుగారి గది’ తమిళ డబ్బింగ్ సినిమా ‘చంద్రకళ’ లాంటి సినిమాలు నవ్విస్తూ భయపెట్టాయి. ఇక గతేడాది తమిళంలో తెరకెక్కిన ‘అరణ్మణై’ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ సినిమాలో రాయ్ లక్ష్మీ హీరోయిన్‌గా నటించగా.. హన్సిక దెయ్యంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.

తమిళంతోపాటు తెలుగులో ‘చంద్రకళ’ పేరిట విడుదలైన ఆ చిత్రం దర్శక, నిర్మాతలకు మంచి పేరు తీసుకు రావడమే కాదు కాసుల వర్షం కూడా కురిపించింది. అయితే ఈ సినిమా సీక్వెల్ తీయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది అందుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టారట. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌లో దర్శకనిర్మాతలు చాలా మార్పులు చేసేశారు.

చంద్రకళ పోస్టర్


సిద్ధార్ధ్‌ని హీరోగా తీసుకున్న డైరెక్టర్.త్రిష – హన్సిక – పూనమ్ బజ్వాలను హీరోయిన్స్‌గా ఎంచుకున్నాడు. తారాగణాన్ని ఎంచుకున్న మరుక్షణమే షూటింగ్ ప్రారంభించేశారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని దీపావళి కానుకగా యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రధాన నటీమణులైన త్రిష-హన్సిక పోస్టర్‌ని రిలీజ్ చేశారు.  హారర్, కామెడీ, థ్రిల్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తుందని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ఇంకా నిర్ణయించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: