
అయితే దీని తర్వాత మళ్లీ ఒక వారంలో మరొక ఘటన చోటు చేసుకున్నది. ఒక వ్యక్తి తెల్లవారుజామున థియేటర్ ఎంట్రీలో కాల్పులు జరిపారు. ఇదంతా కూడా కెనడా ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది.ఇప్పటికే విడుదలైన ఓజి, కాంతార చాప్టర్ 1 వంటి సినిమాల షో లన్ని కూడా రద్దు చేసినట్లు తెలిసింది. ఇలాంటి సంఘటనలు ప్రేక్షకుల అసౌకర్యం కలిగించవచ్చు కానీ భద్రత అంశం ముఖ్యమంటూ థియేటర్ యాజమాన్యాలు తెలుపుతున్నారు. అయితే ఇండియన్ సినిమాలను అక్కడ ప్రదర్శించకూడదంటూ ఖలిస్తాన్ ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారనే విధంగా వినిపిస్తున్నాయి.
ఇటీవలే కెనడాలో భారత కాన్సులేట్ ను కూడా ఖలిస్తాన్ మద్దతుదారులు హెచ్చరించారు. వీరికి తోడు అక్కడ తెలుగు, హిందీ, తమిళ భాషల సినిమాలను నిలిపివేయాలంటూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు వినిపిస్తున్నాయి. అక్కడ ప్రేక్షకులు ఈ విషయం విన్న తర్వాత నిరాశ చెందుతున్నారు.ఇప్పటికే సినిమాలు చూడడానికి టికెట్లు బుక్ చేసుకున్న వారికి కూడా డబ్బులను రిఫండ్ చేసినట్లు తెలిసింది. స్థానిక భద్రత సంస్థలు త్వరగా ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని తిరిగి మళ్లీ సాధారణ పరిస్థితులను తీసుకువచ్చేలా చేయాలి అంటూ అక్కడ ప్రజలు సూచిస్తున్నారు. మొత్తానికి అక్కడ ఇండియన్ సినిమాల చిత్రాలను ప్రదర్శించకపోవడంపై చాలామంది ఫైర్ అవుతున్నారు. మరి ఇలాంటి ఘటనలపైన కెనడా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.