టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా — నిజంగా వేరే లెవెల్ ఫిల్మ్ మేకర్ అని చెప్పాలి. ఆయన సినిమాలు సాధారణ కథలతో కాకుండా భావోద్వేగాలు, రౌడీ యాటిట్యూడ్‌, మరియు రియలిస్టిక్ ఇంటెన్సిటీతో నిండిపోయి ఉంటాయి. “అర్జున్ రెడ్డి”తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న ఆయన, *“కబీర్ సింగ్”*తో బాలీవుడ్‌లో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన *“అనిమల్”*తో సూపర్ సక్సెస్ సాధించి, ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ లిస్ట్‌లో నిలిచారు.


ఇప్పుడు ఆయన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి చేస్తున్న చిత్రం “స్పిరిట్” మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా ప్రారంభం నుంచి ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. మొదట దీపికా పదుకొనే హీరోయిన్‌గా ఫైనల్ అయినప్పటికీ, ఆమె ప్రాజెక్ట్ నుంచి తీసేయడంతో కొత్తగా తృప్తి దిమ్రి హీరోయిన్‌గా ఎంపిక కావడం సినీ వర్గాల్లో పెద్ద సెన్సేషన్‌గా మారింది. ఇక తాజాగా లీకైన సమాచారం ప్రకారం, “స్పిరిట్” రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 5వ తేదీ నుంచి గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. అటు యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆయన లుక్‌, ఇంటెన్సిటీ కొత్త రేంజ్‌లో ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.



మరో షాకింగ్ అప్‌డేట్ ఏమిటంటే .. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో నటించబోతున్నారని ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ ఫ్యాన్స్ కోసం నిజంగా ఫెస్టివల్ అని చెప్పాలి.ఇక విలన్ పాత్ర విషయానికి వస్తే, సందీప్ రెడ్డి వంగా ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు. క్ర్సిహ్ 3, వివేకం, వినయ విధేయ రామ వంటి చిత్రాల్లో తన స్టైలిష్ యాక్టింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్న వివేక్ ఓబ్రాయ్ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారట. ఆయన లాంటి క్లాస్ యాక్టర్‌ను ఇంత పవర్‌ఫుల్ రోల్‌కి ఎంచుకోవడం సందీప్ రెడ్డి వంగా చేసిన మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. మరోవైపు, మలయాళీ బ్యూటీ మడోనా సెబాస్టియన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఆమె పాత్ర సినిమా నారేషన్‌లో కీలక మలుపు తిప్పనుందని టాక్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: