సినీ రంగంలో ప్రేమ వివాహాలు చాలా కామన్. వెండితెర మీద ప్రేమ పాటలు పాడకున్న చాలా మంది జంటలు తరువాత రియల్‌ లైఫ్‌లోనూ బెస్ట్ జోడి అనిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ జోడిలు పెళ్లి తరువాత కూడా కలిసి నటించిన సందర్భాలు మాత్రం కాస్త అరుదే. అయిత అలాంటి అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న కొన్ని హాట్ జోడిల గురించి ఇప్పుడు చూద్దాం.

 

ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన జోడి నాగచైతన్య, సమంత. ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెర మీద కనిపించిన ఈ జోడి ఆ సినిమాతో ఆడియన్స్‌ను కూడా మాయ చేసింది. అందుకే చాలా మంది దర్శక నిర్మతలు ఆ జోడిని రిపీట్ చేసేందుకు ఆసక్తికనబరిచారు. అందుకే జంట నాలుగు సినిమాల్లో కలిసి నటించింది. అయితే వీటిలో మూడు సినిమాల్లో పెళ్లికి ముందే నటించిన ఈ జంట పెళ్లి తరువాత మజిలీ సినిమా కోసం జత కట్టింది. ముందు ముందుకు ఈ జంట మరికొన్ని సినిమాల్లో కలిసి నటించేందుకు రెడీ అవుతోంది.

 

సౌత్‌లో చైతూ, సమంత లాగే బాలీవుడ్‌ లో అందరి దృష్టిని ఆకర్శించిన జంట అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్‌. నేషనల్ లెవల్‌ ఈ జంట హాట్ టాపిక్‌గా మారింది. వీరి పెళ్లి సమయంలో ఐశ్వర్య ఇక సినిమాలకు గుడ్‌ బై చెప్పేస్తుందన్న ప్రచారం జరిగింది. అయితే అందరికీ షాక్‌ ఇస్తూ ఐష్‌ హీరోయిన్‌గా కొనసాగింది. అంతేకాదు అభిషేక్‌తోనూ కలిసి నటించింది. రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన సర్కార్‌ రాజ్‌, మణిరత్నం డైరెక్ట్‌ చేసిన రావన్‌ సినిమాల్లో పెళ్లి తరువాతే ఈ జంట కలిసి నటించింది.

 

అభిషేక్‌కు ఈ ఇన్సిపిరేషన్‌ ఇచ్చింది తండ్రి అమితాబే. తనతో ఎన్నో సినిమాల్లో జంటగా నటించిన జయా బచ్చన్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అమితాబ్‌. పెళ్లి తరువాత జయా బచ్చన్‌ చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నా, తల్లి పాత్రలతో రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీలో అమితాబ్‌కు జోడిగా పలు చిత్రాల్లో నటించాడు జయా బచ్చన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: