కొంతమంది స్టార్ డైరెక్టర్ ల సినిమాలు ప్రేక్షకుల్లో మొదటి నుంచి భారీ అంచనాలను కలుగజేస్తాయి. ఆ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా సినిమా హిట్ అవ్వడం ఖాయం అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలుగజేస్తాయి. కానీ చివరికి ఆ సినిమా మాత్రం సత్తా చాటు లేక చివరికి డిజాస్టర్ గా నిలవడం లేదా యావరేజ్ టాక్ తో  సరిపెట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది.  ప్రేక్షకుల ముందుకు వచ్చిన చాలా సినిమాల విషయంలో ఇలా  జరిగింది. అయితే  వెండితెరపై సత్తా చాట లేకపోయినప్పటికీ బుల్లి తెరపై మాత్రం ఆ సినిమాలు  ఎంతగానో సత్తా చాటుతూ ఉంటాయి. ఇలాంటి సినిమాలలో ఒకటి సరైనోడు. 

 


 అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మరింత బాడీ పెంచి భారీఖాయం గా తయారవ్వడం కూడా మరింత హైప్ తీసుకొచ్చింది. దానికితోడు ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహించడం ప్రేక్షకులు మరింత అంచనాలు పెంచేసింది. దీంతో ఈ సినిమా ఏ రేంజిలో ఉండబోతుందో అని అనుకున్నారు ప్రేక్షకులు... కానీ సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా విషయంలో ఏదైనా తేడా కొట్టేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది ఈ సినిమా. 

 


కాగా  ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా చివరికి యావరేజ్ టాక్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే వెండితెరపై అంతగా సత్తా చాట లేకపోయినప్పటికీ బుల్లితెరపై మాత్రం మంచి క్రేజ్ సంపాదించింది  ఈ సినిమా. సరైనోడు సినిమా తెలుగు బుల్లితెర పై ఇప్పటి వరకు చాలా సార్లు వచ్చింది అని చెప్పాలి. ఎన్ని సార్లు  వచ్చిన ఈ సినిమా మంచి రేటింగ్ సంపాదించుకుంటోంది. వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకొని ఇదే సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో బుల్లితెరపై సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: