అవును మీరు విన్నది నేను అన్నది నిజమే.. ఓ హీరోయిన్ ఇంకో ఇద్దరు హీరోలతో ప్రేమాయణం నడిపిస్తోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఆమె మాత్రం వారితో అలాంటి సంబంధం లేదు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె డేటింగ్ చేస్తున్న ఆ ఇద్దరు హీరోలు ఎవరు? అనే విషయాలు మన సమీక్షలో తెలుసుకుందాం..
ఇక అసలు విషయంలోకి వెళితే.. ప్రియా ఆనంద్. ఈ తమిళ హీరోయిన్ కు సినిమాల సంగతి ఎలా ఉన్నా అమ్మడుకి ఎఫైర్స్ కేమి తక్కువ లేదంటూ వార్తలు వస్తున్నాయి. తమిళ పరిశ్రమలోని ఇద్దరు యంగ్ హీరోలతో ఈమె సన్నిహితంగా ఉంటున్నట్లు టాక్. ఇంతకీ వారేవరంటే.. ఒకరు గడ్డలకొండ గణేష్ సినిమాలో నటించిన తమిళ హీరో అధర్వ కాగా ఇంకొకరు సీనియర్ తమిళ హీరో కార్తిక్ కొడుకు గౌతమ్ కార్తీక్. అవును ఈ అమ్మడు వీరిద్దరితో గత కొంత కాలంగా బాగా సన్నిహితంగా ఉంటున్నట్టు తమిళ మీడియా కోడై కూస్తోంది.
ఇదిలా ఉండగా.. వీటిపై హీరోయిన్ ప్రియా ఆనంద్ స్పందిస్తూ.. "వారిద్దరూ తనకు మంచి మితృలని చెప్పిన ప్రియా ఆనంద్, మా మధ్య అటువంటి సంబంధం లేదని" వివరణ ఇచ్చారు. అధర్వ, గౌతమ్ మరియు ప్రియా మంచి మిత్రులు అని చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఐతే రిలేషన్ లో ఉన్న ఏ హీరోయినైనా చెప్పే మాటలే ఇవి అని కొందరు కొట్టిపారేస్తున్నారు. అయితే దగ్గుబాటి రానా డెబ్యూ మూవీ "లీడర్" తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఆ పొలిటికల్ ఎంటర్టైనర్ జస్ట్ పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఆ తరువాత రామ్ సరసన రామ రామ కృష్ణ కృష్ణ, సిద్దార్ధ్ హీరోగా తెరకెక్కిన 180 చిత్రాలలో నటించింది. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో తెలుగులో ఈమెకు ఆఫర్స్ ఆగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: