టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. కరోనా సృష్టించిన సమస్యలతో దాదాపు 18 నెలలుగా ధియేటర్లు ఖాళీ అయిపోయిన పరిస్థితులలో రాబోతున్న సంక్రాంతికి వస్తున్న భారీ సినిమాలతో ఇండస్ట్రీ మళ్ళీ కళకళలాడుతుంది అన్నఅంచనాలు వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో ఇప్పటికీ తన ఆలోచనలలో ఎటువంటి మార్పులు చేయకపోవడంతో ఎదో విధంగా రాయబారాలు చేసి ప్రభుత్వం ఆలోచనలు మార్చాలని చాలగట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇలాంటి పరిస్థితులలో సంక్రాంతి రాబోతున్న భారీ సినిమాల టిక్కెట్ల రేట్లు పెంచడానికి కొంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించవచ్చు అన్నసంకేతాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొందరు తన భార్య పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తీవ్రంగా కలతచెంది కన్నీరు పెట్టుకోవడంతో ఒక్కసారిగా తెలుగుదేశం వర్గాలలోనే కాకుండా నందమూరి కుటుంబంలో కూడ కదలిక వచ్చింది.


దీనితో ఇప్పటివరకు వైసీపీ సర్కార్ మీద సీరియస్ కామెంట్స్ చేసి ఎరగని బాలకృష్ణ అయితే తన కొత్త సినిమా ‘అఖండ’ లోని భారీ డైలాగులు పేల్చిన రేంజిలో అలాంటి కామెంట్స్ చేసిన వారిని తొక్కి పడేస్తా అంటూ గర్జించాడు. అంతేకాదు తాము తలుచుకుంటే ఏవ్యవస్థలు ఏమీ చేయలేబు అంటూ బాలయ్య ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ రాజకీయంగా కలకలం రేపుతోంది.


మరొకవైపు బాలకృష్ణ తో అంతంత మాత్రంగా తన సంబంధాలు కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కూడ ఏపీలో అరాచక పాలన సాగుతోంది అన్న అర్థం వచ్చే విధంగా కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్ అధినేతల దృష్టికి వెళ్ళడంతో ఈవ్యవహారం మరింత ముదిరి దాని ఫలితంగా టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు చేస్తున్న రాయబారాలకు విఘాతం కలిగిస్తుంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న భారీ సినిమాల టిక్కెట్ల రేట్ల పెంపు ఇక జరిగే విషయం కాదు అన్న మాటలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: