కోలీవుడ్ లో మాస్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకొని ఇక వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో శింబు. ఇక తన సినిమాలను అటు తెలుగులో కూడా విడుదల చేస్తూ ఇక్కడ కొంతమంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా యూత్లో ఈ హీరోకి ఉండే ఫాలోయింగే వేరు. అయితే సినిమాలతో ఎంతలా పాపులారిటీ సంపాదించాడో ఇక తన ప్రేమాయణాలతో కూడా శింబు అంతే వార్తలో నిలుస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక సినిమాల్లో ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఇక ఇతని డాన్సుల్లో ఏదో మ్యాజిక్ ఉందని అంటూ ఉంటారు అభిమానులు.


 అయితే స్టార్ హీరో శింబు లవ్ ఎఫైర్ల గురించిన వార్తలు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటాయి అని చెప్పాలి. ఇక శింబు లవ్ ఎఫైర్ నడిపిన హీరోయిన్ల లిస్ట్ తీస్తే మాత్రం అది ఒక పెద్ద బుక్కే నిండిపోతుంది అని చెప్పాలి  ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో ప్రేమాయణంలో మునికి తేలిన శింబు అందరికీ బ్రేకప్ చెప్పేసాడు  ఇప్పుడు మరో కొత్త హీరోయిన్ తో శింబు రిలేషన్షిప్ లో ఉన్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఇంతకీ శింబు కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు మహానటి కీర్తి సురేష్ అన్నది తెలుస్తుంది  ఇటీవల కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశాడట శింబు. ఈ బర్త్ డే పార్టీ ఏర్పాట్ల కోసం భారీగానే ఖర్చు పెట్టాడట. ఇక ఇంత ఖర్చు పెట్టాడు అంటే శింబు తప్పకుండా ఈమెను బుట్టలో పడేసాడని కోలీవుడ్లో అందరూ చర్చించుకుంటున్నారు. ఇక త్వరలో వీరిద్దరూ కలిసి ఒక సినిమా కూడా చేయబోతున్నారట. అయితే ఇక వీరి ప్రేమాయణం నిజమైతే.. శింబు ఈ హీరోయిన్ ను అయినా పెళ్లి చేసుకుంటాడా లేదా అనే చర్చ కూడా జరుగుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: