
ఇక రీసెంట్‌గా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఒక స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. దానిలో మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి పవన్ కళ్యాణ్ సినిమా చూసారు. ఆ స్క్రీనింగ్‌కి చిరంజీవి, రామ్ చరణ్, అకిరానందన్, డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందరూ హాజరయ్యారు. సినిమాను చూసి ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేశారు. చివరలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, "ఈ ఓజీ యూనివర్స్ చూడటానికి నేను కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అని అఫీషియల్‌గా ప్రకటించడంతో, అక్కడ ఉన్నవారితో పాటు సోషల్ మీడియాలో ఉన్న అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ "ఉస్తాత్ భగత్ సింగ్" సినిమా తర్వాత ఇకపై ఆయన సినిమాల్లో నటించరని, పూర్తి స్థాయిలో రాజకీయాలకే అంకితం అవుతారని అనుకున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ స్వయంగా "ఓజీ యూనివర్సిటీ కోసం నేను ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను" అని చెప్పడంతో, అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. ఈ సినిమాలో ఆయన నటిస్తే ఆయన లెజెండరీ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని వారు నమ్ముతున్నారు.
అదే సమయంలో, ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం కింగ్ నాగార్జునను అప్రోచ్ అయ్యారు చిత్రబృందం అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. నాగార్జున - పవన్ కళ్యాణ్‌కు ఆన్-స్క్రీన్ ఆపోజిట్‌గా కనిపిస్తే, ఆ క్లాష్ వేరే లెవెల్‌లో ఉండబోతోందని ఫ్యాన్స్ ఊహాగానాలు చేస్తున్నారు. దీనితో పాటు “ఓజీ 2”లో రామ్ చరణ్ రోల్ కూడా కన్ఫామ్ అయిపోయిందన్న టాక్ బయటకు రావడంతో, సోషల్ మీడియాలో ఈ న్యూస్ వేగంగా వైరల్ అవుతోంది.ఇక మొత్తానికి చూస్తే, సుజిత్ ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ సాధారణ సినిమా కాదని, మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు క్లాస్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యేలా ఎమోషనల్ ప్యాకేజ్‌తో రూపొందుతోందని ఇండస్ట్రీ టాక్. పవన్ కళ్యాణ్ మాటలు, మెగా ఫ్యామిలీ సపోర్ట్, నాగార్జున విలన్ పాత్ర, రామ్ చరణ్ స్పెషల్ రోల్—ఇవి అన్నీ కలిసే ఈ సినిమాని ఒక హిస్టారికల్ మూవీగా మార్చేలా కనిపిస్తున్నాయి.