ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ గురించి.. ఆయన సంగీతం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకి సంగీతం అందించి మంచి పారితోషకం కూడా అందుకుంటున్న ఈయన తాజాగా మహేష్ బాబు , త్రివిక్రమ్ డైరెక్షన్లో రాబోతున్న ఎస్ ఎస్ ఎం బి 28 సినిమాకి సంగీత దర్శకుడుగా వ్యవహరించబోతున్నట్లు తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి సంగీత దర్శకుడు థమన్ కి .. ఈ సినిమా దర్శక నిర్మాతలకు మధ్య చిన్న గొడవ జరిగిందని , ఈ క్రమంలోనే థమన్ కి బదులుగా అనిరుద్ ని పెట్టబోతున్నట్లు వార్తలు వినిపించాయి.


అంతేకాదు సమస్యలు ఇంకా సద్దు మనగలేదని.. అందుకే అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు థమన్.  గతంలో తనకు సమస్యలు ఉన్న మాట వాస్తవమే.. కానీ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా తానే చేస్తున్నానని అని , అనిరుద్ చేయడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే సినిమా దర్శక నిర్మాతలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. కొన్ని వ్యక్తిగత సమస్యల వల్లే ఇలాంటి పుకార్లు వచ్చాయని స్పష్టం చేశారు థమన్.  ఇప్పుడు అవన్నీ క్లియర్ అవ్వడంతో ఈ సినిమాకు తానే సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నాను అంటూ తెలిపి.. తన పై వస్తున్న వార్తలకు పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు థమన్.


దీంతో ఈ సినిమా సంగీతం విషయంపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.  ఇప్పటికే థమన్ మ్యూజిక్ అందించిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి మహేష్ బాబు 28వ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరి మహేష్ బాబు ఈ చిత్రం పూర్తవగానే తన తదుపరిచిత్రాన్ని రాజమౌళి డైరెక్షన్లో చేయబోతున్నారు.. ఇక ఈ సినిమా ఆయన కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందని ఇప్పటికే రచయిత విజయేంద్ర వర్మ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: