బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. అల్లు అర్జున్ నటించిన జులై సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె దాని అనంతరం పటాస్ షో ద్వారా స్టార్ యాంకర్ గా మారింది. అయితే గత కొంతకాలంగా శ్రీముఖి గురించి సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వస్తున్నాయి. శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుంది అని.  ఒక బిజినెస్ మెన్ తో త్వరలోనే శ్రీముఖి పెళ్లి పీటలు లేక పోతుంది అంటూ పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీముఖి ఈ వార్తలపై స్పందించింది. 

ఇందులో భాగంగా శ్రీముఖి మాట్లాడుతూ...నా పెళ్లి పై వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కొంతమంది కావాలని ఇలాంటి న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలి అంటే ముందుగా నా అభిమానులతోనే చెప్తాను. ఇలాంటి వార్తలు అన్ని వింటుంటే నాకు చాల బాధ కలుగుతుంది. ఇలాంటి ఎన్ని రూమర్స్ స్ప్రెడ్ చేసినప్పటికీ నేను వాటిని పెద్దగా పట్టించుకోను. ఒకవేళ నాకు పెళ్లి చేసుకుని ఆలోచన ఉంటే ముందు మీకే చెప్తాను. అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి.. ఇందులో భాగంగానే మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడగగా..

 నేను పెళ్లి చేసుకునే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికీ చెప్తాను. కానీ ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకుని ఆలోచన లేదు. కనీసం ఇంకో నాలుగు ఐదు సంవత్సరాల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ప్రస్తుతం నా జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అసలు ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. షోలతో ప్రస్తుతం నేను బిజీగా ఉన్నాను...అంటూ పెళ్లిపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది శ్రీముఖి. అయితే గతంలో శ్రీముఖి ఒక అబ్బాయి తో రిలేషన్షిప్ లో ఉండి మోసపోయింది అని అప్పట్లో చాలా రకాల వార్తలు వచ్చాయి. ఇక ఆ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి శ్రీముఖికి చాలా సమయం పట్టింది. దీనికిగాను ప్రస్తుతం సింగిల్గానే తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది శ్రీముఖి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: