అన్ని వ్యాధుల కంటే ఆత్మన్యూనతాభావం చాల భయంకరమైనది. ఇది విషం కన్నా చాల భయంకరమైనది అని అంటారు. ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నవారు ఎంత సమర్ధులు అయినప్పటికీ ఖచ్చితంగా వారు ధనవంతులు కాలేరు. ఈ ఆత్మన్యూనతాభావం వల్ల ఒక వ్యక్తి తనకు ఎన్ని అవకాశాలు వచ్చినా ఆ అవకాశాలను వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలం అవుతాడు. 
 
 
ఇలాంటి భావం ఒక మనిషికి ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. తనకు ప్రతిభ ఉన్నా ఎదుటి మనిషి గుర్తించడం లేదు అనే భావనా తన మొహమాటంతో మనవ సంబంధాల విషయంలో స్పష్టంగా వ్యవహరించలేకపోతున్నాను అనే బాధ తనకు జీవితంలో ఎదగడానికి అవసరమైన ‘బ్రేక్ త్రూ’ లభించడం లేదు అన్న ఆవేదన. ఈ కారణాలు అన్నీ ఒక మనిషిలో ఆత్మన్యూనతాభావం విపరీతంగా పెరిగిపోవడానికి కారకాలుగా మారతాయి. 
 
 
వాస్తవానికి ఒక వ్యక్తి పెద్ద పారిశ్రామిక వేత్తగా ఎదగాలని చిన్ననాటి నుండి కలలు కంటాడు. ఆ వ్యక్తి పారిశ్రామిక వేత్త అవ్వలేకపోవడమే కాకుండా ఒక పెద్ద కంపెనీలో చిరు ఉద్యోగిగా మారిన ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం. అయితే అలా ఒక వ్యక్తి జీవితంలో ఎదగలేకపోవడానికి ఈ ఆత్మన్యూనతాభావం కారణం అని అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఈ ఆత్మన్యూనతాభావం కలిగిన వ్యక్తులు మానవ సంబంధాల విషయంలో చాల వెనకబడి ఉంటారు. 
 
 
ఒక వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో విజయం సాధించి ఐశ్వర్య వంతుడుగా మారాలి అంటే మానవ సంబంధాలు పెంపుదల విషయంలో చాల సమర్థవంతంగా వ్యవహరించాలి వాస్తవానికి ఇది ఒక కళ. జీవితంలో ఎదిగిన వారు అంతా ఈ ఐడెంటిటీ క్రైసిస్ ను తప్పించుకున్న వారు మాత్రమే. ఒక సినిమాలో ఛాన్స్ రాకపోతే జీవితం అయిపోయింది అని నచ్చిన ఉద్యోగం దొరకకపోతే జీవితం వృథా అని భావించేవారు ఈ ఆత్మన్యూనతాభావం తో ఉన్నట్లే లెక్క. అయితే మనల్ని ఎవరో గుర్తించాలి అన్న విషయం ఆలోచనలలో పెట్టుకోకుండా మనకు మనమే మన ప్రతిభను గుర్తించే స్థాయికి ఎదగాలి. ఈ సూత్రమే సంపదకు మార్గం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: