కరోనా పరిస్థితుల నేపధ్యంలో దేశంలో అన్ని పరిశ్రమలు వ్యాపారాలు తిరోగమనంలో కొనసాగుతూ ఉన్నప్పటికీ 2024 నాటికి దేశంలో మీడియా వినోద రంగం బిజినెస్ 4.1 లక్షల కోట్లకు చేరువలో ఉండి జర్మనీ ఆస్త్రేలియాను భారత్ అధిగమిస్తుంది అన్న అంచనాలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో వినోదరంగం రికవరీ చాలవేగంగా జరిగే ఆస్కారం ఉందని ముఖ్యంగా ఓటీటీ విభాగం చాలవేగంగా అభివృద్ధి చెందుతుందని ఈనివేదిక వెల్లడించింది.


వీక్షకుల పరంగా భారత్ ప్రపంచంలోని అతిపెద్ద సినిమా మార్కెట్ గా మారే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈనివేదిక అభిప్రాయ పడుతోంది. ముఖ్యంగా డిజిటల్ విభాగాలు అయిన ఓటీటీ ఆన్ లైన్ ప్రకటనలు ఆన్ లైన్ గేమింగ్ మ్యూజిక్ రంగాలు బాగా రాణించే ఆస్కారం ఉందని ఈనివేదిక అభిప్రాయం.


సినిమాహాళ్ళు మూసి వేయడంతో ప్రజలు నెమ్మదిగా ధియేటర్లను మర్చిపోయే పరిస్థితి ఏర్పడి జనం ఆశక్తి విపరీతంగా ఓటీటీ ఆన్ లైన్ గేమింగ్ ల వైపు మళ్ళిందని ఈనివేదిక అభిప్రాయం. ప్రస్తుతం ఓటీటీ పరిశ్రమకు వస్తున్న స్పందనతో ఈపరిశ్రమ టర్న్ ఓవర్ 2.7 బిలియన్ డాలర్లకు చేరువలో 2024 కు ఉంటుందని ఈ నివేదిక అంచనాలు వేస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్ స్ట్రీమింగ్ రంగం అభివృద్ధి కూడ బాగా ఉండటంతో 1.7 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని అంచనాలు వస్తున్నాయి.


మొత్తం వినోదరంగంలో 20 శాతం వాటాను ఓటీటీ రంగం ఆక్రమించినా ఆశ్చర్యం లేదు అంటూ ప్రింట్ మీడియాలో ప్రకటనల కంటే ఆన్ లైన్ ప్రకటనలు జనం ఎక్కువగా చూస్తున్న పరిస్థితులలో ఆన్ లైన్ ప్రకటనలకు కూడ మంచి ఆదాయం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వినోద పరిశ్రమ రికవరీ ఆంగ్ల అక్షరం ‘కే’ ఆకృతిలో ఉందని ఈ నివేదిక అభిప్రాయ పడుతోంది. రానున్న కాలంలో ఓటీటీ సంస్థలకు తమ చందాదార్లు మరింత పెరుగుతారు అని ఈనివేదిక చెపుతున్న పరిస్థితులలో రానున్న రోజులలో వినోద పరిశ్రమలలో భారీ మార్పులు రాబోతున్నాయి అన్న అంచనాలు వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: