డబ్బు ఇదః జగత్ అని అంటున్నారు ప్రస్తుత కాలంలో. చిన్న పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు డబ్బు.. డబ్బు.. డబ్బు.. అసలు డబ్బు లేనిదే ఏ పని జరగదు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. పూర్వకాలంలో ఒక రూపాయి విలువకు ఎన్నో రకాల కూరగాయలు కూడా వచ్చేవి. కానీ ప్రస్తుత కాలంలో ఒక రూపాయి తీసుకొని బయటకు వెళ్తే, బిచ్చగాడు కూడా ఆ రూపాయను తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. అంతలా రోజు రోజుకు రూపాయి విలువ పెరిగిపోతోంది కానీ మనుషుల విలువ రోజురోజుకీ పడిపోతుందనే విషయాన్ని చాలా మంది గుర్తించలేకపోతున్నారు.. ఇందుకు కారణం డబ్బును వృధాగా చేయడం. మనలో చాలామందికి డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు.. కానీ దానిని ఎలా ఆదా చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు.

డబ్బులు సంపాదించడం మాత్రమే తెలిస్తే సరిపోదు.. దాన్ని ఎలా ఆదా చేయాలో కూడా తెలిసిన వాడే నిజమైన ఆస్తిపరుడు అవుతాడు. అయితే డబ్బు ఎలా ఆదా చేయాలో.. అందులో కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మనలో చాలామంది అప్పులు తీసుకుని, ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఉద్యోగస్తులు కూడా క్రెడిట్ కార్డులను తీసుకొని వాటికి ప్రతి నెలా టాక్స్ లు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా వీటి అప్పులు ఏవైనా ఉంటే, వాటిని చిన్న మొత్తంతో కలుపుకొని పెద్ద మొత్తం వరకు తీర్చుకుంటూ వెళ్లాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే.. అప్పులు తీసుకున్నప్పుడు వడ్డీ భారం, మనం సంపాదించే దానిలో సగం వడ్డీలకు పోతే,  మిగతా దానిని మనం ఆదా చేయడానికి సరిపోదు
కాబట్టి అప్పులు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.


అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకూడదు. ఇటీవల కాలంలో చాలా మంది తమ ప్రత్యేకతను  చూపించుకోవడం కోసం, అవసరం లేని వస్తువులను కూడా తీసుకుని ఇబ్బందులపాలు అవుతూ ఉంటారు. ఇలాంటి అనవసరమైన వస్తువుల వల్ల మనకు ఎలాంటి మేలు జరగదు. కాబట్టి వీటిని సాధ్యమైనంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.


మీరు డబ్బులు ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. ఒకవేళ అలా తెలుసుకోలేకపోతే మీరు ఆదా చేసే డబ్బు పైన జాగ్రత్త ఉండదు. కాబట్టి డబ్బు సేవ్ చేసుకోవాలనుకున్న వారు ఎక్కువగా ప్రభుత్వ రంగాలు మనకు అందిస్తున్న సేవలను ఉపయోగించడం ఉత్తమం. ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులను ఆదా చేసుకోవడానికి ఎన్నో మార్గాలను ఏర్పరచింది. వాటిని క్షుణ్ణంగా తెలుసుకొని అందులో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. తక్కువ కాలం వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ పోతే, ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు..

మీకొచ్చే ప్రతినెలా జీతంలో మీరు వేటికి ఎంత కేటాయిస్తున్నారో కూడా తెలుసుకోవాలి..   అందుకు ఒక నోట్ ను ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం. మీరు ఏం కొంటున్నారు.. ఎక్కడ డబ్బును వృధా చేస్తున్నారు.. అందులో చక్కగా రాసుకోవాలి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, ఎక్కడ డబ్బు వృధా అవుతుందో తెలుసుకుని వాటిని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది..


చూశారు కదా..! ప్రస్తుతానికి ఈ కొన్ని చిట్కాలను పాటించి,  డబ్బులు ఎలా ఆదా చేయాలో తెలుసుకొని కొద్దికొద్దిగా మొదలు పెట్టండి. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేయాలి అంటే ఎవరికి వీలుపడదు. కాబట్టి చిన్న చిన్నగా వెళ్తూనే ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవడానికి వీలవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: