ఈమధ్య కాలంలో పరిశుభ్రమైన రసాయన మందులు లేని ఆహారం దొరకడం చాలా కష్టం. కానీ ప్రజలు ఎక్కువగా ఇలాంటి ఆహారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రజల అభిరుచులను మీరు అవకాశంగా తీసుకొని వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించినట్లయితే తప్పకుండా మీ ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం చాలా మంది రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వేసి పంట సాగు చేస్తే ప్రజలు కూడా వాటిని ఆసక్తిగా కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. ఈ నేపథ్యంలోని మీరు దానిని బిజినెస్ గా మార్చుకోవచ్చు. సాధారణంగా అరటి కాండం పనికిరాదని భావించి, దానిని కట్ చేసి పక్కన పడేస్తూ ఉంటారు. కానీ అరటి కాండంతోనే మీరు డబ్బు సంపాదించవచ్చు.

అరటి పంటలు పండించే రైతులు సాధారణంగా దాని కాండం పారవేస్తారు. కానీ ఇది నేల మరియు పర్యావరణం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫలితంగా నేలసారం తగ్గుతుంది. కానీ ఈ కాండం సేంద్రియ ఎరువుగా మార్చడం వల్ల లాభాలు పొందవచ్చు. సేంద్రియ ఎరువును తయారు చేయడానికి మొదటగా మీరు ఒక గొయ్యిని తవ్వి అందులో అరటి కాండం, ఆవుపేడ, కలుపు మొక్కలు వెయ్యాలి.  దీనితోపాటు డీకంపోజర్ కూడా స్ప్రే చేయాలి.  అలాగే ఇతర కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను కూడా మనం జోడించవచ్చు.  ఫలితంగా సేంద్రియ ఎరువుగా మారుతుంది.  దీనిని రైతులు పంట పొలాల్లో పంటలు పండించడానికి ఉపయోగిస్తారు.  అంతేకాదు ఈ ఎరువులు మీరు మార్కెట్లో అమ్మినా సరే మీకు మంచి లాభాలు వస్తాయి.


ప్రస్తుత కాలంలో పట్టణాలలో కూడా చాలామంది మిద్దె తోటలు అవలంబిస్తున్న నేపథ్యంలో మీరు కూడా ఈ సేంద్రియ ఎరువును సేల్ చేస్తే ప్రతి ఒక్కరు కొనుగోలు చేస్తారు. ఇలా కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు అలాగే ఈ సేంద్రియ ఎరువులను ఉపయోగించి మీరే పంటలు పండించి ఇతరులకు అమ్మినా సరే మీకు లాభం బాగుంటుంది.ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒక్క ఐడియాతో రెండు విధాలుగా లాభం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: