ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ మహిళలకు సైతం ఏపీ ప్రభుత్వం శుభవార్త తీసుకురావడం జరిగింది. మహిళా సాధికారిక లక్ష్యంగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. సొంత కాళ్లపై నిలబడాలనుకునే ప్రతి ప్రేద మహిళలకు సైతం ఎస్సీ ఎస్టీ మహిళలకు కేవలం 10 శాతం ఖర్చుతో ఆటోలు సమకూర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.దీని ద్వారా ఆర్థికంగా ఆ కుటుంబం బలపడేలా చేసే విధంగా సన్న హాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వడ్డీ లేని రుణాలను సైతం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి పలు ప్రాంతాలలో కొంతమంది మహిళలు ఆటోలను అద్దెకు తీసుకొని నడుపుకుంటున్నట్లుగా తెలియడంతో ఇకపై వారు అలాంటివి ఏమి చేయకుండా సొంత ఆటోలను నడుపుకోవడం ద్వారా మరింత ఆదాయాన్ని పొందేలా ఏపీ సీఎం ఆలోచించి వీరి కోసం మహిళా శక్తి కార్యక్రమాన్ని రూపొందించారట. ఈ పథకంలో ఆటోను కొన్న వారికి అయ్యే ఖర్చుల 10 శాతం లబ్ధిదారి అయిన మహిళలు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 90 శాతం అంతా కూడా స్పేర్స్ ద్వారా ప్రత్యేకమైన రుణాన్ని అందిస్తారట తీసుకున్న రుణానికి కూడా వడ్డీ ఉండదట.

డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లబ్ధిదారులకు కొత్త ఆటోలను అందజేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి ఆఖరి కల్లా లబ్ధిదారులను పూర్తి చేసి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న కొత్త ఆటోలను మహిళలకు అందించే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మహిళలకు తాము తీసుకున్న మొత్తం మరణాన్ని 48 నెలల లో చెల్లింపు చేసే అందుబాటు కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరు చొప్పున 660 మంది ఈ కార్యక్రమం ద్వారా చేయూతను అందిస్తున్నారట. ఇప్పటికే 20030 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది వారికి డ్రైవింగ్లో శిక్షణతో పాటు భద్రత లోపాలను కూడా వివరించే విధంగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: