హీరో సునీల్ పరిస్థితి ఎలా తయారైందో అందరికి తెలిసిందే.. తొలుత కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరో గా మారి కొన్ని సినిమాలు హిట్ కొట్టినా ఆ తర్వాత అన్ని ఫ్లాప్ సినిమాలు చేసి దారుణమైన ఇమేజ్ ని మూటగట్టుకున్నాడు.. ఇప్పుడు హీరో గా, కమెడియన్ గా రెండు విధాలుగా సునీల్ కి చేతిలో పెద్దగా సినిమాలు లేవని చెప్పాలి.. ఇక తాజాగా సునీల్ కి ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.. అనిల్ రావిపూడి చేయబోయే F3 సినిమాలో సునీల్ నటించబోతున్నాడట..