తొలి సినిమా నుంచి ఎంతో వైవిధ్యం ఉండే విధంగా చూసుకుంటాడు కార్తీ.. అయన ఇటీవలే నటించిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఆ సినిమా తర్వాత చేసిన దొంగ సినిమా పర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం సుల్తాన్ సినిమా లో నటిస్తున్న కార్తీ ఆ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ను దసరా సందర్భంగా రిలీజ్ చేశాడు.. భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు .. ప్రముఖ తమిళ నిర్మాత ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ రోజే ఫస్ట్ లుక్ లాంచ్ చేశాడు. ఇందులో కార్తి లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.