తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక విషయంలో కలసికట్టుగా వెళ్లడానికి రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చలు జరుపుతామని ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో బీజేపీ-జనసేన నేతల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయని జనసేన పార్టీ ఓ ప్రకటన చేసింది.