ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి గారి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మధ్య ప్రదేశ్ లోని పలు లొకెషన్స్‌లో షూటింగ్స్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శర వేగంగా జరుపుకుంటోంది. అతి త్వరలో భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించి థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. తాజాగా క్రిస్మస్ శుభాకాంక్షలతో సరిక్రొత్త పోస్టర్ మరియు గ్లింప్స్ రిలీజ్ చేశారు.
హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ - ఇప్పటికే అనౌన్స్ చేసిన మా టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మధ్య ప్రదేశ్ లోని పలు లొకేషన్స్‌లో షూటింగ్ పూర్తి చేశాం. ధన్య, ఎస్తర్,సుప్రిత వంటి మంచి క్యాస్టింగ్‌తో పాటు అశోక్ కుమార్, జెమిని సురేష్, భద్రమ్ లాంటి సీనియర్ యాక్టర్స్ మా సినిమాలో భాగం అవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు
దర్శకుడు జివికె మాట్లాడుతూ - మంచి ఆర్టిస్టులతో పాటు ఉత్కంఠభరితమైన కథ, కథనంతో ఈ సినిమా తెరకెక్కింది. సీనియర్ సినిమాటోగ్రాఫర్ జె ప్రభాకర్ రెడ్డి గారి విజువల్స్, హనుమాన్ ఫేమ్ సాయిబాబు తలారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. పద్మనాబ్ బరద్వాజ్ గారి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్స్‌లో ఆడియన్స్‌ని హారర్ మూడ్ క్యారీ చేసే విధంగా చేస్తుంది` అన్నారు
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి