జబర్దస్త్ షో తో అనస్య ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. గత ఏడేళ్లుగా అనసూయ ఈ షో కి యాంకరింగ్ చేషు బాగానే ఆర్జించింది కూడా.. ఇక్కడ వచ్చిన పాపులారిటీ తోనే అనసూయ వెండితెరపై కూడా నటించడం మొదలుపెట్టింది.. అక్కడ కూడా క్లిక్ అవడంతో ఆమెకు ఎదురు లేకుండా పోయింది.. దర్శక నిర్మాతలు ఆమె కోసం ప్రత్యేక పాత్ర లు రాసి ఆమెను నటింపచేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హీరోయిన్ ల కు సమానంగా ఆమెకు రెమ్యునరేషన్ లు ఇచ్చి మరీ తమ సినిమాల్లో పెట్టుకుంటున్నారు..