సినీ నటి, ఫైర్ బ్రాండ్ , నగరి ఎమ్మెల్యే రోజా , బుల్లితెర మహారాణి రోజా ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. చేతిలో మంచి మంచి ఆఫర్స్ తో పాటు, రాజకీయంగా మంచి పేరు అన్నీ ఆమెకు బాగానే ఉన్నాయి.. అయితే ఈ స్థానం రావడానికి ఆమె పడ్డ కష్టం అంతా ఇంతాకాదు.. తొలినాళ్లలో ఆమె హీరోయిన్ అవడానికి ఎంత కష్టపడిందో ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. తాను నల్లగా ఉన్నానని అందరూ ఎగతాళి చేసేవారని కూడా చెప్పింది.. అయితే అవన్నీ తట్టుకుని నిలబడింది కాబట్టే రోజా ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది.. ఎవరో అవమాన పరిచారని వెనక్కి వెళితే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..