క్రాక్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు మలినేని గోపీచంద్..ఈ సినిమా తో టాప్ హీరోల దృష్టిలో పడ్డాడు. చిరు కూడా ఆయనతో సినిమా చేయాలనీ ఆశపడుతున్నారు..ఒక పెద్ద హీరో ఇలా ఓ సినిమా ని, డైరెక్టర్ ని మెచ్చుకోవడం అంటే చాల పెద్ద విషయమే.. అందులోనూ ఇప్పుడిప్పుడే స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతున్న ఓ డైరెక్టర్ కి ఈ ప్రశంశ మంచి బూస్టప్ ని ఇస్తుంది.. అసలే చిరు వరుసగా మాస్ సినిమా లపై దృష్టి పెట్టాడు. ఈ మాస్ హిట్ తో గోపీచంద్ కి ఓ ఛాన్స్ ఇచ్చినా ఇచ్చేయొచ్చు అంటున్నారు సినీ పరిశీలకులు.. అయితే ఈ సక్సెస్ కోసం గోపీచంద్ ఏళ్లుగా ఎదురుచూశాడు.