మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా ఉప్పెన.. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ ఫిబ్రవరి 14 న సినిమా విడుదల కాబోతుంది. సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా కి దర్శకుడు. కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతున్నారు.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రేజీ కాంబో తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి..