తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రేంజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే.. దేశవ్యాప్తంగా ఈ షో కి ఉన్న క్రేజ్ ఏ షో కి లేదు.. సీజన్ ల పరంగా వస్తున్న ఈ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.. తెలుగులో నాలుగు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజన్ కి ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇక నాల్గో సీజన్ అయిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ల అల్లరి మాత్రం తగ్గడమే లేదు. సోషల్ మీడియా లో వారు పెట్టె పోస్ట్ లు చూస్తుంటే ప్రేక్షకులు తమని మర్చిపోకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు అనిపిస్తుంది. ఇక అభిజిత్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విజేత గా బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితుడు. బిగ్ బాస్ హౌస్లో అద్భుతమైన ఆటతీరుతో నాలుగో సీజన్ విజేతగా నిలిచాడు అభిజీత్. బయటకు వచ్చిన తర్వాత నుంచి వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు.