గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో అనిరుధ్, హీరోయిన్ కీర్తి సురేష్ ల పెళ్లి వ్యవహారం తెగ ప్రచారం అవుతుంది.. ఎప్పటినుంచో వీరు ప్రేమలో ఉన్నట్లు, ఇప్పుడు పెళ్లి కూడా సెహెసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లో కూడా వీరి గురించిన వార్తలు తెగ హల్చల్ అయ్యాయి. నేను శైలజ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె సెకండ్ సినిమా నేను లోకల్ తో వరుసగా రెండో హిట్ కొట్టింది.. మహానటి సినిమాతో ఒక్కసారిగా తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తి సురేష్. ఈ సినిమా తో స్ట్రెయిట్ గా టాప్ లోకి వెళ్ళిపోయినా కీర్తి ఆ తర్వాత ఆ స్టార్ డమ్ ని నిలబెట్టుకోలేకపోయింది.