టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్య తో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. సాయి పల్లవి కథానాయిక.. ఈ సినిమా నుంచి వచ్చిన సారంగదారియా సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రేండింగ్ గా నిలుస్తుంది. కేవలం రెండు రోజుల్లో కోటి వ్యూస్ అందుకున్నఈ పాట విశేషంగా యూత్ ని ఆకట్టుకుంటుంది. మంగ్లీ పాడిన ఈ పాటకు పవన్ సంగీతం అందించగా ఈ పాటకు ఫుల్ ఫిదా అయిపోతున్నారు విన్న ప్రేక్షకులు..ప్రస్తుతం 30 మిలియన్ లకు చేరువలో ఉంది ఈ పాట.. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది.