హాలీవుడ్ నటుడు ఆర్మీ హ్యామర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నటుడు హ్యూమర్ తనను శారీరకంగా, మానసికంగా ఎంతో హింసించాడని 24 ఏళ్ల ఎఫీ అనే మహిళ ఆరోపించింది. 2016లో ఫేస్బుక్ ద్వారా హ్యూమర్ని కలిసానని, అప్పటినుంచి తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఏప్రిల్ 24, 2017న నటుడు ఆర్మీ హ్యూమర్ లాస్ఏంజిల్స్లో తనపై నాలుగు గంటల పాటు హింసాత్మకంగా అత్యాచారం చేశాడని, తన తలను పదేపదే గోడకు కొట్టేవాడని పేర్కొంది.దీంతో తల, ముఖానికి బలంగా గాయాలైనట్లు మహిళ ఆరోపించింది. వీటిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించినట్లు తెలిపింది.