ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం `పీనట్ డైమండ్`. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఒకేసారి రెండు టైం లైన్స్ లో జరిగే కథగా తెరకెక్కుతుంది. అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్ ప్రధాన పాత్రలలో నటించారు.ప్రొడక్షన్ నెం.1గా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి వెంకటేష్ త్రిపర్ణ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు.