రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు తెలియని వారుండరేమో. కానీ డైరెక్టర్ గా కొంతమందికే తెలుసు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తిగా చాలామందికి తెలుసు.. అప్పుడెప్పుడో చేసిన శివ సినిమా ఇప్పటికీ కొన్ని సినిమాలకు ఆదర్శంగా నిలుస్తుంది.. ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ కాగా ఆ సినిమా ను రామ్ గోపాల్ వర్మ ఇప్పటికీ చెప్పుకుని సినిమా ఆఫర్స్ కొట్టేస్తున్నాడంటే ఆశ్చర్య పోనవసరంలేదు. ఇప్పుడు ఆ వచ్చే ఛాన్స్ లు కూడా వర్మ కి రావట్లేదు.. గమనిస్తే గత కొన్ని రోజులనుంచి ఆయననుంచి సినిమాలు అస్సలు రావట్లేదు..