విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి హీరోగా ఆర్ ఆర్ ఆర్ ప్రొడక్షన్స్ & జె కే క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి అనుశ్రీ సమర్పణలో రాజశేఖర్,ఖాసీం లు నిర్మించిన చిత్రం MMOF ఉరఫ్ 70MM. ఎన్.ఎస్ సి దర్శకత్వం వహించగా ఈ సినిమా నేటినుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా జేడీ చక్రవర్తి మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సినిమా ధియేటర్ నడుపుకునే ఓ వ్యక్తి ఆ థియేటర్లో అడల్ట్ సినిమాలు నడుపుకుంటూ ఉంటాడు. అయితే ధియేటర్ కి వచ్చిన వాళ్ళు చనిపోతూ వుంటారు.. అసలు వీళ్ళు చనిపోవడానికి, ధియేటర్ కి, ఆ అడల్ట్ సినిమాలకి ఉన్న సంభందం ఏమిటి అన్నది సినిమా కథ.. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ కు మంచి స్పందన రాగ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి..