ప్రశాంత్ వర్మ చేసిన తొలి సినిమా కి రెండు నేషనల్ అవార్డులు దక్కించుకున్నారు. తొలిసినిమా " అ! " తోనే ఆయన వినూత్నమైన ప్రయోగం చేసి ప్రేక్షకుల ప్రశంసల తో పాటు , అవార్డులు పొందారు. ఈ సినిమాకి సినీ ప్రముఖుల నుంచి, విమర్శకుల నుంచి ఆయనకు వచ్చిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. తొలి సినిమాతోనే ఇంత వెరైటీ కాన్సెప్ట్ చేశాడేంటి అనిపించుకున్నాడు ప్రశాంత్ వర్మ .